బాలకృష్ణ వీర సింహారెడ్డి సినిమాతో మల్లూ బ్యూటీ హనీ రోజ్ మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరోసారి ఎందుకు అంటున్నాం అంటే 2008 సంవత్సరంలోనే ఈమె తెలుగు లో హీరోయిన్ గా ఆలయం అనే సినిమాను చేసింది. శివాజీ హీరోగా నటించిన ఆ సినిమా పెద్దగా ఆడలేదు. దాంతో అప్పట్లో హనీ రోజ్ ను ఫిల్మ్ మేకర్స్ పెద్దగా పట్టించుకోలేదు.
తెలుగు లో 'ఆలయం' సినిమా గుర్తింపు తెచ్చి పెట్టలేక పోయినా కూడా మలయాళంలో ఈ అమ్మడికి వరుసగా ఆఫర్లు వచ్చాయి. మలయాళంలో ఎన్నో గుర్తుండిపోయే పాత్రలు చేసిన హనీ టాలీవుడ్ లో వీర సింహారెడ్డి పాత్రతో మంచి గుర్తింపు దక్కించుకుంది.
బాలకృష్ణ కు తల్లి పాత్రలో మరియు భార్య పాత్రలో కనిపించి రెండు విధాలుగా కూడా హనీ మెప్పించింది.
టాలీవుడ్ లో వీర సింహారెడ్డి సినిమా తర్వాత హనీ బిజీ అయ్యే అవకాశాలు ఉన్నాయి అంటూ సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
వీర సింహారెడ్డి సినిమా ఫలితం తో సంబంధం లేకుండా హనీ రోజ్ ఈ సినిమా తో మంచి గుర్తింపు దక్కించుకోవడంతో ముందు ముందు తెలుగు లో ఈ అమ్మడు మరిన్ని ఆఫర్లు దక్కించుకుంటుంది అనిపిస్తుంది.
నటిగా మరియు అందంతో వీర సింహారెడ్డి ఆకట్టుకోవడంతో హనీ రోజ్ గురించి ప్రస్తుతం తెలుగు మీడియాలో తెగ హడావుడి చేస్తోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.