ప్రపంచం మహమ్మారీ సంక్షోభంలో కూరుకుపోవడం.. దాదాపు తొమ్మిది నెలల విరామం తర్వాత థియేటర్లు తెరవడం.. కరోనా భయాలు ఇంకా పూర్తిగా తొలగిపోక ముందే సినిమాల్ని రిలీజ్ చేయడం ఇదంతా కలలా ఉంది. తొలిగా డైలమా నుంచి బయటపడి టాలీవుడ్ ఈ సాహసం చేయడం ఉత్కంఠను పెంచింది. సాయి ధరమ్ తేజ్ నటించిన `సోలో బ్రతుకే సో బెటర్` క్రైసిస్ అనంతరం రిలీజైన మొట్టమొదటి సినిమాగా రికార్డులకెక్కగా.. తాజాగా సంక్రాంతి కానుకగా మాస్ మహారాజా రవితేజ నటించిన `క్రాక్` రిలీజైంది. ఈ రెండు సినిమాలు పరిశ్రమ హోప్ ని నిలబెట్టాయి. ఆశించిన ఫలితాన్ని అందుకున్నాయి.
అసలు జనం థియేటర్లకు వస్తారా రారా? అన్న సందిగ్ధతలు ఉన్నా.. 50శాతం ఆక్యుపెన్సీతో రిస్క్ ఉండదని భావించి జనం థియేటర్లకు రావడం ఆశాజనకంగా మారింది. తాజాగా క్రాక్ వసూళ్ల రిపోర్ట్ మరింత ఆశను పెంచింది.
రవితేజ క్రాక్ పాజిటివ్ టాక్ తో ఆరంభమై తొలిరోజు 10కోట్ల గ్రాస్ ..6కోట్ల షేర్ వసూళ్లను సాధించగా.. రెండోరోజు 3కోట్ల షేర్ (6కోట్ల గ్రాస్) తో ఔరా అనిపించింది. ఈ వీకెండ్ నాటికి 10 కోట్ల షేర్ మార్క్ తో చక్కని ఫలితం సాధించింది. 50శాతం ఆక్యుపెన్సీతో థియేటర్ల ముందు హౌస్ ఫుల్ బోర్డులు కనిపించడం ఆశను ఆసక్తిని పెంచింది.
క్రాక్ బ్రేక్ ఈవెన్ కావాలంటే మరో 6కోట్ల షేర్ వసూలు చేయాల్సి ఉంటుంది. మూడో రోజు వసూళ్లు.. ఈ పండగ సీజన్ సెలవుల్ని పురస్కరించుకుని సినిమా పూర్తిగా సేఫ్ జోన్ కి వస్తుందన్న అంచనాలేర్పడ్డాయి. ఎలా చూసుకున్నా ఇది ఆశాజనకమైన ఫలితమే. సంక్రాంతికి నాలుగు సినిమాలు నువ్వా నేనా అంటూ పోటీపడుతున్నాయి. దీనివల్ల క్రాక్ దూకుడు ఇకపైనా మునుపటిలా సాగదు. వసూళ్లను షేర్ చేసుకుంటుంది కాబట్టి కాస్త నెమ్మదిగా మాత్రమే మిగతా వసూళ్లను సాధించే వీలుంటుంది. మరో 5 కోట్ల షేర్ రాబట్టినా ఆల్మోస్ట్ సేఫ్ అయినట్టేనన్నది ఓ అంచనా.