అవే కథలా? మార్చండయ్యా సామీ!!

Update: 2015-11-06 17:30 GMT
ఒక అమ్మాయిన ఎవరో కామిస్తారు.. ఆమె ఒక్కదానినే తీసుకెళ్లి రేప్‌ చేసి చంపేస్తారు.. లేదా అడ్డొచ్చిన ఆమె ఫ్యామిలీని కూడా చంపేస్తారు. ఆ శవాలను ఒక ఫామ్‌ హౌస్‌ లో పాతేస్తారు. అక్కడికే కొందరు వెళ్తారు. ఆ దెయ్యం వారిని పట్టుకొని అందరిపై పగ తీర్చుకుంటుంది. మన ఇండియన్‌ రైటర్లు సెట్‌ చేసుకున్న ఒక లాజిక్‌ లేని ఫార్ములాయిక్‌ స్టోరీ ఇది. ట్రేడ్‌ మార్క్‌ దేశీ హారర్‌ కహానీ ఇది. దీనినే పట్టుకొని వేళాడటం మన ఆనవాయితే.

ప్రేమ కథా చిత్రమ్‌ అయినా.. గంగ అయినా.. గీతాంజలి కావచ్చు.. త్రిపుర కావచ్చు.. సినిమా పేరేదైనా నటులెవరైనా పాత్రలు ఎలా మారినా.. మూల కథ మాత్రం అదే. ఏవండి మాకు తెలియక అడుగుతాం.. అసలు దెయ్యాలకు అంత పవర్ ఉంటే.. ఆ ఇంట్లోనే ఎందుకు ఉండటం.. డైరెక్టుగా తమని చంపినవారి దగ్గరకు వెళ్లి వేసేయొచ్చుగా? లేకపోతే పనిమనిషిని పట్టుకున్న దెయ్యం.. ఆ బాడీతో వెళ్ళి విలన్లను లేపేయొచ్చుగా? ఇలాంటి సందేహాలు అడగకుండా మనోళ్ళు ఈ హారర్‌ కామెడీలను చూడాలసిందే. ఎన్ని పాయింట్లలో మొదలెట్టినా కూడా అందరూ తిరిగి తిరిగి ఈ కథ చుట్టూతానే ప్రదక్షిణలు చేస్తున్నారు.

హారర్‌ కామెడీలు అంటే.. ఇంతకంటే ఏం ఉండవా? ఇంతకంటే కథలే లేవా? కొత్త ప్లాట్లు రాయండయ్యా.. ఆడియన్సకు కూడా విసుగొచ్చేస్తోంది.. చూడలేకపోతున్నారు. ఇప్పటికే ఫ్రెంచ్‌ - జర్మన్‌ - అమెరికన్‌ - కొరియన్‌ హారర్‌ సినిమాలను డౌన్‌ లోడ్ చేసుకొని చూస్తూ ఎంజాయ్‌ చేస్తున్నారు. కొన్నాళ్ళయితే తెలుగు హారర్‌ కామెడీలు పూర్తిగా మర్చిపోతారేమో.

Tags:    

Similar News