రానా సినిమా అంటే.. సమ్ థింగ్ డిఫరెంట్ అనే ఒక స్థాయి నమ్మకం వచ్చేసింది ప్రేక్షకులకు. మొదట్నుంచీ.. రొటీన్ కథలకు, మూసధోరణి ఫార్ములాలకు దూరంగా ఉంటూ వచ్చిన రానా.. ఇదే ట్రెండ్ ను కంటిన్యూ చేస్తున్నాడు. త్వరలో మరో వెరైటీ కథతో రాబోతున్నట్టు సమాచారం.
బాహుబళితో భళ్లాల దేవగా తన సినీ ప్రయాణంలో సువర్ణాధ్యాయం లిఖించుకున్నాడు రానా. ఈ మధ్యనే అరణ్యగా వచ్చి అలరించారు. మరోవైపు.. విరాట పర్వంలో నక్సలైట్ గా కనిపించబోతున్నారు. ఇటు పవన్ కల్యాణ్ తో కలిసి అయ్యప్పనుమ్ కోషియమ్ రీమేక్ లో ప్రత్యేక పాత్ర పోషిస్తున్నారు.
ఈ విధంగా వైవిధ్యమైన కథలను, పాత్రలను ఎంచుకుంటున్న రానా.. ఇప్పుడు మరోసారి డిఫరెంట్ సబ్జెక్ట్ తో రాబోతున్నట్టు సమాచారం. దర్శకుడు సుకుమార్ శిష్యుడు పల్నాటి సూర్య ప్రతాప్.. పీరియాడికల్ డ్రామాతో ఓ సినిమా తెరకెక్కించబోతున్నాడు. ఇందులో రానా హీరోగా నటించున్నట్టు సమాచారం.
కత్తి యుద్ధాలు, గుర్రపు స్వారీల కాలం నాటి కథతో ఈ సినిమా రూపొందనుందని తెలుస్తోంది. అటు.. పవన్ సినిమా పూర్తయిన తర్వాత.. ఇటు విరాట పర్వం చుట్టేసిన అనంతరం.. ఈ సినిమా మొదలయ్యే ఛాన్స్ ఉందని అంటున్నారు.