హైదరాబాద్‌లోని ఓ పేరొందిన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సినీ దర్శక ప్రముఖుడికి తన జీవితంలో కనీవినీ ఎరగని రీతిలో అనూహ్యమైన షాక్ తగిలిందట. దాదాపు నెల రోజులుగా వైద్య సేవలు అందుకుంటున్న ఆ ప్రముఖుడు తాజాగా తనకు వచ్చిన ఆస్పత్రి బిల్లును చూసి దిమ్మ తిరిగిపోయినంత పని అయిందట.
షాక్ కొట్టే రేంజ్‌లో ఉన్న ఈ బిల్లులో ఆయనకు అయిన ఖర్చుల వివరాలు అన్నీ చుక్కలు చూపించే రేంజ్‌లో ఉన్నాయట. అంటే వైద్య చికిత్స, చికిత్స గది అద్దె, కుటుంబ సభ్యులకు ఇచ్చిన గదుల, ఆయన్ను చూడటానికి వచ్చిన అతిథుల, ఆయనకు ఏర్పాట్లు చేసిన సౌకర్యాల తాలుకు బిల్లుల చార్జీలు మోత మోగించే రేంజ్ లో ఉన్నాయని సమాచారం. ఈ బిల్లును చూసిన అనంతరం ఆయన ఆగ్రహావేశాలకు లోనయి అప్పటివరకు ఉన్న వీవీఐపీ వార్డు నుంచి అదే ఆస్పత్రిలోని సామాన్య గదుల్లోకి మారినట్లు తెలుస్తోంది. కళ్లు తిరిగిపోయే రీతిలో ఉన్న ఆ బిల్లు ఇప్పుడు సినీ, రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారిందని అంటున్నారు.
సమాజంలో గొప్ప స్థానంలో ఉండటమే కాకుండా ఆర్థికంగా కూడా బలంగా ఉన్న సదరు ప్రముఖుడే ఈ బిల్లును చూసి షాక్‌కు లోనయ్యే పరిస్థితి ఉంటే ఇక సామాన్యుల పరిస్థితి ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి నడ్డి విరగొట్టే బిల్లులకు వ్యతిరేకంగా హైకోర్టును ఆశ్రయించగలరా అనే చర్చ కూడా మొదలైంది. రోగాన్ని నయం చేసేందుకు వైద్యులు ప్రయత్నం చేస్తున్నారేమో కానీ ఆస్పత్రి ద్వారా వచ్చే బిల్లు మాత్రం మానసిక, భావోద్వేగ సమస్యలను కలిగించే విధంగా ఉందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/