`వార్` సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకుని బాలీవుడ్ లో వరుసగా క్రేజీ చిత్రాల్లో అవకాశాలు అందుకుంది వాణీ కపూర్. యష్ రాజ్ ఫిలింస్ సంస్థాన నాయికగా ఈ అమ్మడికి ఒక రేంజు ఉందిప్పుడు. ఆ క్రమంలోనే వాణీతో ప్రచారం కోరుకుంటూ.. ప్రముఖ బ్రాండ్లు క్యూ కడుతుండడం హాట్ టాపిక్ గా మారింది.
తాజాగా వాణీ ని ప్రఖ్యాత స్పానిష్ వస్త్ర శ్రేణి బ్రాండ్ మ్యాంగో తమ ప్రచారకర్తగా నియమించుకుంది. ఇందుకోసం కోట్లాది రూపాయల డీల్ ని కుదుర్చుకుందని తెలిసింది. మ్యాంగో - మైంత్రాతో కలిసి భారతదేశంలో విస్తరించే ప్రణాళికలు వేస్తోంది. ఆ క్రమంలోనే తమ మొదటి బ్రాండ్ అంబాసిడర్ గా వాణీ కపూర్ తో డీల్ కుదుర్చుకుంది.
మైంత్రా- మ్యాంగో తొలి ప్రకటన మార్చి 19 నుంచి డిజిటల్లో అలానే సోషల్ మీడియా మాధ్యమాలలో లాంచ్ చేయనున్నారు. మ్యాంగో ఆరంభం 12 రకాల వేసవి వేరియెంట్లలో కలెక్షన్స్ ని పరిచయం చేస్తుందట. దీనికోసం వాణీ తో ప్రచార ప్రకటనను రూపొందించింది.
బాలీవుడ్ లో తన అద్భుతమైన నటనతో వాణీ ప్రతిభావంతురాలిగా తనదైన ముద్ర వేసింది. వరుసగా భారీ చిత్రాల లైనప్ తో ప్రేక్షకుల మనస్సులలో బలమైన ముద్ర వేయడం ఖాయం. అందుకే వాణీతో ప్రచారం తమకు కలిసొస్తుందని మ్యాంగో సంస్థ ప్రకటించింది. `హ్యాపీ అండ్ ఐ నో ఇట్` అనే థీమ్ తో రూపొందించిన ప్రకటనను ప్రసారం చేసేందుకు సిద్ధమవుతున్నామని వెల్లడించింది.
వాణీ ఇటీవల వరుస ఫోటోషూట్లతో సోషల్ మీడియాలో భారీగా ఫాలోవర్స్ ని పెంచుకోవడంతో అది తమ ప్రచారానికి కలిసొస్తుందని మ్యాంగో భావిస్తోందట. ప్రస్తుతం వాణీ ఇండస్ట్రీ బెస్ట్ చిత్రాల్లో అవకాశాలు అందుకుంటోంది. షంషేరా .. బెల్ బాటమ్ లాంటి భారీ చిత్రాల్లో నటిస్తోంది. అలాగే `ఛండీఘర్ కరే ఆషికీ` అనే ప్రేమకథా చిత్రంలోనూ ఈ అమ్మడు నాయికగా నటిస్తోంది.