క్యూట్ కాదు హాట్ హీరోయిన్లకే ఇక్కడ క్రేజ్ ఎక్కువా?

Update: 2020-02-17 04:31 GMT
తెలుగు దర్శకనిర్మాతలు.. హీరోలు లోకల్ అమ్మాయిలకు హీరోయిన్ అవకాశాలు ఇవ్వరని ఒక అపవాదు ఉంది.  అంతే కాదు టాలీవుడ్ లో క్యూట్ గా ఉండే హీరోయిన్ల కంటే హాట్ గా ఉండే హీరోయిన్లకే డిమాండ్ ఎక్కువ అని కూడా ఒక వాదన వినిపిస్తోంది. ఈమధ్య భారీగా అవకాశాలు సాధిస్తున్న హీరోయిన్లను చూస్తే ఆ విషయం అర్థం అవుతుంది.

మలయాళ బ్యూటీ కళ్యాణి ప్రియదర్శన్ 'హలో' తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.  'చిత్రలహరి' లో కూడా నటించింది. అయితే ఆ తర్వాత ఇక్కడ అవకాశాలు లేకపోవడంతో కోలీవుడ్ కు మకాం మార్చింది. క్యూట్ గా ఉండే కళ్యాణికి ఇక్కడ కంటే కోలీవుడ్ లో ఎక్కువ అవకాశాలు వస్తున్నాయి.  కళ్యాణి మాత్రమే కాదు.. ఇలా ఉండే పక్కింటి అమ్మాయి టైపు బ్యూటీలకు టాలీవుడ్ లో పెద్దగా డిమాండ్ లేదు. డిమాండ్ అంత హాటు ఘాటు భామలకే.. బికినీ బేబీలకే.

ఇలా హాటు హీరోయిన్ల బ్యాచ్ లో పూజ హెగ్డే..రాశి ఖన్నా.. నిధి అగర్వాల్.. నభ నటేష్.. పాయల్ రాజ్ పుత్ లాంటి కొత్త భామలు..సమంతా.. శ్రియ.. కాజల్.. తమన్నా లాంటి సీనియర్ హాటీలకే ఇక్కడ అవకాశాలు దక్కుతున్నాయి.  బోల్డ్ ఇమేజ్.. గ్లామర్ ప్రదర్శనలకు సై సై అంటున్న వారికే ఆఫర్లు.  అలా కాకుండా క్యూట్ గా ఉండే భామలకు మహా అంటే ఒకటి రెండు అవకాశాలే.  ఆ తర్వాత  తట్టా బుట్టా సర్దుకోకతప్పేలా లేదు.



Tags:    

Similar News