సినిమాను ఎంత రిచ్ గా తీసినా.. ఎంత గొప్ప కంటెంట్ తో తీసినా కూడా దాన్ని బాగా ప్రమోట్ చేసి ప్రేక్షకులకు రీచ్ అయ్యేలా చేయలేక పోతే సినిమా పోయినట్లే. ఈమద్య కాలంలో సినిమా బడ్జెట్ ను బట్టి ప్రమోషన్ కు కూడా ఖర్చు చేస్తున్నారు. స్టార్ హీరోల సినిమాల ప్రమోషన్స్ కు కోట్లల్లో ఖర్చు చేస్తున్నారు. డబ్బులు ఖర్చు చేయడమే కాకుండా విభిన్నంగా ప్రమోట్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. సినిమాల ప్రమోషన్స్ విషయంలో బాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ చాలా విభిన్నంగా ప్రయత్నిస్తూ ఉంటారు.
త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న బాలీవుడ్ 'హౌస్ ఫుల్ 4' మూవీకి వినూత్న రీతిలో ప్రమోషన్ చేస్తున్నారు. ఇప్పటి వరకు ఏ సినిమాకు చేయని తరహాలో ఈ ప్రమోషన్స్ ను నిర్వహిస్తున్నారు. ఇందుకోసం ఇండియన్ రైల్వేస్ తో ఒప్పందం చేసుకుని ఒక రైలును హౌస్ ఫుల్ 4 నిర్మాత బుక్ చేసుకున్నాడు. ఆ రైలుకు పూర్తిగా చిత్ర పోస్టర్లను అంటించారు. ముంబయి నుండి ఢిల్లీ వరకు ఈ రైలు ప్రయాణం సాగుతుంది. మార్గం మద్యలో పలు స్టేషన్స్ వద్ద ఆపుతూ సినిమాను ప్రమోట్ చేస్తూ వెళ్తారు.
ఈ ఆలోచనకు ఖరీదు కాస్త ఎక్కువే అయినా సినిమాకు భారీగా పబ్లిసిటీ దక్కుతుందని చిత్ర యూనిట్ సభ్యులు భావిస్తున్నారు. ఈ రైలులో చిత్ర నటీ నటులు యూనిట్ సభ్యులు అంతా ప్రయాణిస్తూ మార్గ మద్యలో జనాలతో ఇంట్రాక్ట్ అవుతారు. దాంతో సినిమాకు మంచి పబ్లిసిటీ దక్కింది. ముంబయి టు ఢిల్లీ రైట్ టూర్ తో సినిమాకు మంచి పబ్లిసిటీ దక్కడం ఖాయం. ఇలాంటి విభిన్నమైన ప్రమోషన్ కార్యక్రమాలు చేయడం వల్ల సినిమాకు మంచి ఓపెనింగ్స్ వస్తాయి.
అక్షయ్ కుమార్.. రితేష్ దేశ్ ముఖ్.. బాబీ డియోల్.. కృతి సనన్.. పూజా హెగ్డే లు కీలక పాత్రలో నటించిన ఈ చిత్రంపై ఇప్పటికే బాలీవుడ్ ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. ఇక ఈ విభిన్నమైన ప్రమోషన్ తో సినిమాకు మరింత పబ్లిసిటీ దక్కడం ఖాయంగా సినీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అక్టోబర్ 25న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రంకు పర్హాద్ సమ్జీ దర్శకత్వం వహించాడు.