మాస్ రాజా రవితేజ నటించిన ''రామారావు ఆన్ డ్యూటీ'' సినిమా శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. శరత్ మండవ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ.. మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. సినీ విశ్లేషకులు రివ్యూలు కూడా అందుకు తగ్గట్టుగానే వుండటంతో తొలి రోజే ఫ్లాప్ ముద్రను వేసుకుంది.
'రామారావు ఆన్ డ్యూటీ' సినిమా అసలు రవితేజ చేయాల్సిన సినిమా కాదని ఫ్యాన్స్ అభిప్రాయ పడుతున్నారు. ముఖ్యంగా ఈ మూవీ విషయంలో దర్శకుడు శరత్ ను ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారు. బోరింగ్ కథనంతో ఏమాత్రం ఆకట్టుకోని స్క్రీన్ ప్లే తో నీరసంగా సినిమాను నడిపించాడని విమర్శిస్తున్నారు.
రామారావు లాంటి పసలేని కంటెంట్ తో సినిమా తీసి, థియేటర్లకు రావడం లేదని ప్రేక్షకులను ఎలా నిందిస్తారని మేకర్స్ పై సోషల్ మీడియాలో విరుచుకుపడుతున్నారు. ఓటీటీలో కూడా చూడలేని ఇలాంటి బోరింగ్ సినిమాలను ఆడియన్స్ ఎలా థియేటర్లలో ఆదరిస్తారని అనుకున్నారని డైరెక్టర్ ను ప్రశ్నిస్తున్నారు.
ఈ సందర్భంగా విడుదలకు ముందు శరత్ చేసిన కామెంట్స్ ను కూడా గుర్తు చేస్తున్నారు. 'ట్విట్టర్ రివ్యూలు చూసి సినిమాలకి వెళ్లకండి. సినిమా ఫస్ట్ షో పడకముందే రివ్యూలు వచ్చేస్తున్నాయి. అలా నెగిటివ్ కామెంట్స్ కారణంగా జనాలు థియేటర్ కి వెళ్లి సినిమాలు చూడలేకపోతున్నారు. మీ వల్ల సినిమా కలెక్షన్ దెబ్బ తింటున్నాయి' అని దర్శకుడు వ్యాఖ్యానించారు.
ట్విట్టర్ లో పిట్టలు రెట్టలు మాత్రమే వేస్తాయి.. వాళ్లెవ్వరూ కూడా మంచి ట్వీట్లు వేయడం లేదు అని రామారావు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో శరత్ కామెంట్స్ చేశారు. దీనిపై సోషల్ మీడియాలో పెద్ద చర్చే జరిగింది. ఇప్పుడు సినిమా రిజల్ట్ చూసి అతన్ని పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు. మంచి సినిమాని ఎలాంటి రివ్యూలు ట్వీట్స్ ఆపలేవని.. అలానే చెత్త సినిమాని ఎంత లేపినా సక్సెస్ చేయలేమని పేర్కొంటున్నారు.
మాస్ మహారాజా లాంటి స్టార్ ఇచ్చిన పెద్ద అవకాశాన్ని శరత్ ఉపయోగించుకోలేకపోయారని.. అలానే రవితేజ పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేశారని అభిమానులు దర్శకుడిని ట్విట్టర్ లో ట్రోల్ చేస్తున్నారు. ఈ పరాజయానికి దర్శకుడు శరత్ ప్రధాన కారణమని ఆరోపిస్తున్నారు.
ఇటీవల కాలంలో థియేటర్లలోకి వచ్చిన ఏ సినిమా కూడా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోవడం లేదు. 'రామారావు ఆన్ డ్యూటీ' చిత్రం పైనే అందరూ ఆశలు పెట్టుకున్నారు. టాలీవుడ్ బాక్సాఫీస్ కు నూతనోత్సాహం తీసుకొస్తుందని భావించారు. కానీ ఇది కూడా నిరాశ పరిచింది.
దీంతో రాబోయే 'బింబిసార' 'సీతారామం' 'మాచర్ల నియోజకవర్గం' 'కార్తికేయ 2' 'లైగర్' సినిమాలపైనే అందరి దృష్టి ఉంది. ఈ సినిమాలైనా మంచి కంటెంట్ తో ప్రేక్షకాదరణ పొందాలని అందరూ కోరుకుంటున్నారు. మరి బాక్సాఫీస్ వద్ద ఏం జరుగుతుందో చూడాలి.