ఆ హీరోయిన్ ప‌రిస్థితి మ‌రీ ఇలా మారిందేంటీ?

Update: 2022-04-16 09:30 GMT
సినిమా ఓ రంగుల ప్ర‌పంచం. ఎవ‌రికైనా ఇక్క‌డ క్రేజ్ వున్నంత వ‌ర‌కే విలువ. స‌క్సెస్ వున్నంత వ‌ర‌కు ప‌ట్టం.. అవి ట్రాక్ త‌ప్పాయా.. డిమాండ్‌, గౌర‌వం.. ఒక్కొక్క‌టిగా విడిచిపోతుంటాయి. అందుకే చాలా మంది దీపం వుండ‌గానే ఇల్లు చ‌క్క‌బెట్టుకోవాల‌ని డిమాండ్ వున్న‌ప్ప‌డే ఎడా పెడా సినిమాలు చేసేస్తూ వుంటారు.

అయితే కొంత మంది మాత్రం చేసేది లేక డిమాండ్ త‌గ్గిపోవ‌డంతో వ‌చ్చిన మొత్తంతోనే సంతృప్తి ప‌డుతూ కాలం వెళ్ల‌దీస్తుంటారు. గ‌తంలో భారీ క్రేజ్ ని సొంతం చేసుకున్న వాళ్లంతా ఇప్ప‌డు క్రేజ్ త‌గ్గిపోవ‌డంతో ఇచ్చినంతే పుచ్చుకుంటూ సినిమాలు చేస్తున్నారు.

ఇటీవ‌ల ఓ హీరోయిన్ క్రేజ్ త‌గ్గ‌డంతో పారితోషికాన్ని త‌గ్గించేసి షాకిచ్చింది. ఇప్ప‌డు మ‌రో హీరోయిన్ కూడా ఇదే త‌ర‌హాలో పారితోషికాన్ని తీసుకుంటూ ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఇప్ప‌టికే ఓ హీరోయిన్ రెమ్యున‌రేష‌న్ త‌గ్గించుకుని షాకిస్తే తాజాగా మ‌రో హీరోయిన్ ఏకంగా డైలీ కాల్షీట్స్ కి ప‌డిపోవ‌డం ప‌లువురిని ఆశ్చ‌ర్యానికి గురిచేస్తోంది. గ‌త కొన్నేళ్లుగా హీరోయిన్ గా కొన‌సాగుతున్న స‌ద‌రు హీరోయిన్ కెరీర్ లో భారీ ఆఫ‌ర్ల‌ని అందుకోలేక‌పోయింది.

ఇటీవ‌ల ఓ సినిమాలో ఐట‌మ్ సాంగ్ చేసినా ఆ హీరోయిన్ కు క‌లిసి రాలేదు. ఇక ఓ హీరోతో ఎఫైర్ ని కూడా ఆమెకు ఆపాదించ‌డంతో ఆమె కెరీర్ దాదాపుగా ఎండింగ్ స్టేజ్ కి వ‌చ్చేసింది.

అయినా స‌రే మ‌రో ప‌ని లేక‌పోవ‌డంతో ఐట‌మ్ సాంగ్ ల‌కు, హీరోయిన్ పాత్ర‌ల‌కు డే కాల్షీట్స్ చొప్పున తీసుకుంటూ బండి లాగించేస్తోంది. గ‌తంలో క్రేజ్ వున్న స‌మ‌యంలో ఒక్కో సినిమాకు 40 నుంచి 50 ల‌క్ష‌ల వ‌ర‌కు అందుకున్న హీరోయిన్ ఇప్ప‌డు డిమాండ్ త‌గ్గ‌డంతో 15 నుంచి 20 ల‌క్ష‌ల‌తో స‌ర్దుకుంటోంది.

కెరీర్ ప‌రంగా సంతృప్తి లేక‌పోయినా ఈ మాత్ర‌మైనా త‌న‌కు అవ‌కాశాలు వ‌స్తున్నందుకు హ్యాపీగానే వున్నాన‌ని చెబుతోంద‌ట‌. బాడీ షేప్ అవుట్ కావ‌డంతో ఇత‌ర హీరోయిన్ ల త‌ర‌హాలో ప్ర‌త్యేకంగా ఫొటోషూట్ ల‌లో త‌ను పాల్గొన‌లేక‌పోతోంద‌ట‌. అంతే కాకుండా ఇత‌ర‌త్రా షూరూమ్ ఓపెనింగ్ ల‌కి కూడా త‌న‌ని ఎవ‌రూ పిల‌వ‌డం లేద‌ని వ‌చ్చిన ఆఫ‌ర్ల‌తోనే స‌రిపెట్టుకుంటూ వ‌స్తోంద‌ని చెబుతున్నారు. స‌ద‌రు హీరోయిన్ గురించి తెలిసిన వాళ్లంతా ఇండ‌స్ట్రీలో ఏది చేసినా సంపాదించినా క్రేజ్ వున్నంత వ‌ర‌కే వ‌న్స్ క్రేజ్ పోయిందా? ఇక్క‌డ ఎవ‌రూ ప‌ట్టించుకోరు అని సెటైర్లు వేస్తున్నారు.
Tags:    

Similar News