ఈ మధ్య స్టార్ హీరోలకు సంబంధించిన క్రేజీ సినిమాలని రీ రిలీజ్ చేస్తున్న విషయం తెలిసిందే. 4కె ఫార్మాట్ లోనూ రిలీజ్ చేస్తూ అభిమానులకు సర్ ప్రైజింగ్ ట్రీట్ లు ప్లాన్ చేస్తున్నారు. సూపర్ స్టార్ మహేష్ 'పోకిరి'తో టాలీవుడ్ లో ఈ ట్రెండ్ మొదలైంది. 4కె ఫార్మాట్ లో రిలీజ్ అయిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయి వసూళ్లని రాబట్టి రికార్డులు సృష్టించింది. ఈ మూవీ తరువాత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన 'జల్సా'ని కూడా రీ రిలీజ్ చేయడం అది 'పోకిరి' రికార్డుల్ని తిరగరాయడం తెలిసిందే.
ఇక ఈ మధ్య సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ నటించిన 'చెన్నకేశవరెడ్డి'ని కూడా రీ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. సీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో వి.వి.వినాయక్ తెరకెక్కించిన ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ వసూళ్ల పరంగా 'పోకిరి', జల్సా రికార్డుల్ని తిరగరాసిందని ప్రచారం చేశారు. అయితే అవి ఫేక్ కలెక్షన్ లని తేలడంతో ఫ్యాన్స్ ఊసూరుమన్నారు. త్వరలో ఇదే పంథాలో ప్రభాస్, రామ్ చరణ్ తో పాటు పలువురు స్టార్ హీరోల క్రేజీ మూవీస్ ని కూడా 4కెలోకి మార్చేసి రీ రిలీజ్ చేస్తున్నామంటూ వార్తలు వినిపిస్తున్నాయి.
ఇందులో సూపర్ స్టార్ కృష్ణ నటించి డైరెక్ట్ చేసిన 'సింహాసనం' మూవీ కూడా వుంది. అయితే ఈ మూవీని 4కెలో కాకుండా మరింత అడ్వాన్స్డ్ వెర్షన్ 8కెలోకి మార్చి రీ రిలీజ్ చేయబోతున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. రీసెంట్ గా ఓ పోస్టర్ ని కూడా ఇడుద చేసిన విషయం తెలిసిందే. ఇదిలా వుంటే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన 'వర్షం'తో పాటు 'బిల్లా' మూవీలని ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా రీ రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు. వీటికి సంబంధించిన వర్క్ కూడా ఆఅల్ మోస్ట్ ఫినిష్ అయినట్టుగా తెలుస్తోంది.
తాజాగా ప్రభాస్ నటించిన 'రెబల్' మూవీని రీ రిలీజ్ చేశారు. లారెన్స్ దర్శకత్వంలో ప్రభాస్, రెబల్ స్టార్ కృష్ణంరాజు కలిసి నటించిన ఈ మూవీ అప్పట్లోనే డిజాస్టర్ అనిపించుకుంది. అంతా బ్లాక్ బస్టర్ హిట్ లని రీ రిలీజ్ చేస్తుంటే ప్రభాస్ విషయంలో మాత్రం డిజాస్టర్ అనిపించుకున్న 'రెబల్'ని రీ రిలీజ్ చేయడం ఏంటనే కామెంట్ లు వినిపిస్తున్నాయి. ప్రభాస్ పుట్టిన రోజుని క్యాష్ చేసుకోవాలని ప్రయత్నించి 'రెబల్' ని రీ రిలీజ్ చేశారు. అయితే ముందే ఈ మూవీ డిజాస్టర్ కావడంతో అభిమానులు ఈ మూవీపై అంతగా ఆసక్తిని చూపించడం లేదు.
సినీ లవర్స్ కూడా ఇంట్రెస్ట్ ని చూపించకపోవడంతో 'రెబల్' థియేటర్లన్నీ బోసిపోతున్నాయని చెబుతున్నారు. ప్రభాస్ ని పవర్ ఫుల్ గా ప్రజెంట్ చేసినా సినిమాలో ఆశించిన స్థాయి కథ, కథనాలు లేకపోవడం.. లారెన్స్ మార్కు ఓవరాక్షన్ సెంటిమెంట్ వుండటంతో జనంతో పాటు ఫ్యాన్స్ 'రెబల్'ని భరించలేకపోయారు. దీంతో ఈ మూవీ డిజాస్టర్ గా మారింది. ప్రొడ్యూసర్స్ కి భారీ నష్టాలని తెచ్చిపెట్టడంతో ప్రొడ్యూసర్స్ లారెన్స్ పై ఫిర్యాదు చేయడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. అలాంటి సినిమాని మళ్లీ ఫ్యాన్స్ పై రుద్దితే తిరిగి అలాంటి ఫలితమే వస్తుంది అని 'రెబల్' మరో సారి నిరూపించిందని కామెంట్ లు వినిపిస్తున్నాయి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.