కమల్ తో బ్రేకప్ తర్వాత అంత కష్టపడిందా?

Update: 2016-12-11 11:37 GMT
కమల్ హాసన్ తో దాదాపు దశాబ్దంన్నర నుంచి కలిసి ఉంటున్న గౌతమి.. తమ బంధం గురించి ఏనాడూ మాట్లాడింది లేదు. కానీ కమల్ నుంచి విడిపోతూ మాత్రం దాని గురించి ట్విట్టర్ ద్వారా అందరికీ వెల్లడించింది. తన జీవితంలో ఇది అత్యంత బాధాకర నిర్ణయం అని చెప్పింది. కమల్ ఇంటి నుంచి గౌతమి ఏ పరిస్థితుల్లో బయటికి వచ్చిందో కానీ.. వచ్చాక మాత్రం చాలా ఇబ్బంది పడినట్లు చెప్పింది గౌతమి. వెంటనే తనకు ఇల్లు దొరకని పరిస్థితుల్లో తన ఆఫీస్ లోనే నెల రోజుల పాటు ఉండాల్సి వచ్చిందని ఆమె చెప్పడం గమనార్హం. తాజాగా జయలలిత మృతి గురించి గౌతమి ప్రధానికి లేఖ రాయడంలో కొందరు రాజకీయ నాయకులు వెనక ఉండి ఆమెను నడిపిస్తున్నారన్న ఆరోపణలు రావడంపై స్పందిస్తూ గౌతమి ఈ విషయాన్ని వెల్లడించింది.

‘‘నాకెవ్వరి అండదండలూ లేవు. అంత సపోర్ట్‌ ఉండి ఉంటే.. నేను ఈ మధ్య ఓ పెద్ద నిర్ణయం తీసుకుని బయటికొచ్చినప్పుడు.. ఎక్కడ ఉండాలో తెలియక ఓ నెల రోజులు నా ఆఫీసులోనే ఉండాల్సి వచ్చింది. ఆ తర్వాతే ఇల్లు చూసుకున్నాను. ఓ ఎమోషనల్‌ మూమెంట్‌ నుంచి నన్ను నేను బయటకు లాక్కుని మామూలు మనిషి కాగలిగాను. ఒకసారి నా జీవితం గురించి సమీక్షించుకున్నాను. ఇన్నేళ్లు జీవితాన్ని ఎలా సాగించా.. ఇకపై ఎలా ఉండాలి అని ఆలోచించుకుని ధైర్యంగా నిలబడ్డాను. అండదండలు మెండుగా ఉంటే ఇలా ఇబ్బంది పడాల్సిన పని లేదు. ‘విశ్వరూపం’ విషయంలో జయలలితకు.. కమల్ కు విభేదాలు తలెత్తాయని.. ఈ నేపథ్యంలో కమల్ మీద కోపంతో తాను జయలలితకు మద్దతుగా ఇప్పుడు మాట్లాడానని అనడం అమానుషం. నా మనసులో ఫీలింగుకి.. ఎప్పుడో జరిగిపోయిన విషయాలను ముడిపెట్టడం సరి కాదు. పనీపాటా లేనివాళ్లు ఒక గదిలో కూర్చుని ఇలాంటివి మాట్లాడతారు. నా వ్యక్తిగత విషయానికి.. జయలలిత గారి మరణానికి కారణమేంటి’’ అని ప్రశ్నించింది గౌతమి.
Tags:    

Similar News