దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న దిషా సంఘటనపై టాలీవుడ్ యంగ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ ఎమోషనల్ గా స్పందించాడు. మగవారు ఇంత రాక్షసంగా తయారు అవ్వడంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రతి ఒక్కరు కూడా మానవత్వంతో మెలగాలని.. మనుషులు మనుషులుగా ప్రవర్తించనప్పుడు వారికి మానవ హక్కులు ఎలా వర్తిస్తాయంటూ ట్విట్టర్ లో ప్రశ్నించాడు.
ఈ విషయమై ట్విట్టర్ లో విజయ్ దేవరకొండ స్పందిస్తూ.. మన అనుకున్న వారు ఎవరైనా ఆపదలో ఉన్నారని అనిపిస్తే లేదంటే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అనిపిస్తే వారితో ఎక్కువగా ఫోన్ లో టచ్ లో ఉండటం మంచిది. మనుషులుగా ప్రవర్తించని మానవ మృగాలు చాలా మంది ఉన్నారు. అలాంటి వారికి అసలు మానవ హక్కులను వర్తింపజేయాల్సిన అవసరం లేదు అంటూ విజయ్ దేవరకొండ అభిప్రాయం వ్యక్తం చేశాడు. మానవ హక్కులను పక్కన పెట్టి అలాంటి వారిని కఠినంగా శిక్షించాలంటూ విజయ్ కోరాడు.
మరో వ్యక్తి ఇలాంటి ఘోరాలకు పాల్పడాలంటే భయపడేలా నిందితులను శిక్షించాలని విజయ్ దేవరకొండ అన్నాడు. మన చుట్టు ఉన్న వారిలో ఎవరైనా తప్పుగా ఆలోచిస్తే మనం సరిదిద్దాల్సింది పోయి వారిని సమర్ధిస్తూ వారికి మద్దతుగా నిలవద్దంటూ కోరాడు. ప్రతి ఒక్కరు కూడా బాధ్యతతో ఉండాలని.. సమాజం పట్ల ప్రతి ఒక్కరు బాధ్యతగా ఉండాలంటూ ఈ సందర్బంగా విజయ్ దేవరకొండ పేర్కొన్నాడు.