లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ బృందం ఇటీవల ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి అప్ డేట్ ఇచ్చింది.
ఆమెకు COVID-19 దానికి ముందే న్యుమోనియా ఉన్నట్లు నిర్ధారణ అయిందని తెలిపారు. తర్వాత ఆమె ముంబైలోని బ్రీచ్ కాండీ హాస్పిటల్ లో చేరి వారం పైగా ట్రీట్ మెంట్ తీసుకుంటున్న సంగతి తెలిసిందే.
గాయకురాలి సన్నిహితురాలు అయిన అనూష శ్రీనివాసన్ అయ్యర్ మాట్లాడుతూ, ``'లతా దీదీ మునుపటి తో పోలిస్తే ఇప్పుడు మెరుగుదల సంకేతాలను చూపుతోంది. డాక్టర్ ప్రతిత్ సమదానీ నేతృత్వంలోని అద్భుతమైన వైద్యుల బృందం నుండి ఐసియులో చికిత్స పొందుతోంది. ఆమె త్వరగా కోలుకోవాలని ఇంటికి తిరిగి రావాలని మేము ఎదురుచూస్తున్నాము. ప్రార్థిస్తున్నాము`` అని అన్నారు.
లతా మంగేష్కర్ ఆరోగ్యం గురించి తెలుసుకున్న తర్వాత ఆమె త్వరగా కోలుకోవాలని కోరుతూ పలువురు అభిమానులు మరియు సినీ పరిశ్రమ సభ్యులు సోషల్ మీడియాకు వెళ్లారు.
మీరు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను అని అభిషేక్ బచ్చన్ ట్విట్టర్ లో రాశారు.
కొన్ని రోజుల క్రితం ఆసుపత్రిలో లతాజీ ఆరోగ్యం క్షీణించిందని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ఆమె స్టేబుల్ అని పేర్కొంటూ ఆమె బృందం అధికారిక ప్రకటన విడుదల చేసింది. ''తప్పుడు వార్తలు ప్రచారం కావడం కలకలం రేపుతోంది. లతా దీదీ స్థిరంగా ఉన్నారని దయచేసి గమనించండి. సమర్థులైన వైద్యుల చికిత్సలో ICUలో కొనసాగుతున్నారు. దయచేసి ఆమె త్వరగా ఇంటికి తిరిగి రావాలని ప్రార్థించండి అని ప్రకటన వెలువడింది