సాహో ఫస్ట్ డే టార్గెట్ ఎంత ?

Update: 2019-08-06 08:58 GMT
ఇప్పుడు సౌత్ లోనే కాదు దేశంలోని సినిమా ట్రేడ్ కళ్లన్నీ సాహో ఫస్ట్ డే కలెక్షన్స్ మీదే ఉన్నాయి. విడుదలకు ఇంకో పాతిక రోజులు ఉన్నప్పటికీ ఇప్పటికే దీనికి సంబంధించిన అంచనాలు లెక్కలతో బుర్రలు వేడెక్కిస్తున్నారు. రెండు వందల కోట్లకు పైగా బడ్జెట్ అయ్యింది కాబట్టి అంతే మొత్తంలో షేర్ రావాలి దానికి రెండింతలు మించి అంటే ఓ ఐదు వందల కోట్లు దాటితేనే సాహో కమర్షియల్ లెక్కల్లో సేఫ్ ప్రాజెక్ట్ అనిపించుకుంటుంది. ఇక్కడ కీలక పాత్ర పోషించేది మొదటి రోజు వసూళ్లు.

ఇండియాతో మొదలుకుని ఓవర్సీస్ దాకా ఎంత రాబట్టవచ్చు అనే దాని మీద ఇప్పటికే అభిమానులు చాలా ఆశలు పెట్టుకున్నారు. ఇన్ సైడ్ టాక్ ప్రకారం సాహో మొదటి రోజు ఒక్క తెలుగు వెర్షన్ నుంచే 125 కోట్ల దాకా వసూళ్లు ఆశిస్తున్నట్టు తెలుస్తోంది.  ఇక హిందీ వెర్షన్ దేశవ్యాప్తంగా భారీ ఎత్తున అత్యధిక కేంద్రాల్లో రిలీజవుతుంది కాబట్టి ఎంతలేదన్నా ఫైనల్ రన్ అయ్యేలోపు 500 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టాలనే ఆలోచన ఉన్నట్టుగా వినికిడి. నిజానికి ఇదంతా జరిగే పనేనా అనే అనుమానం రాకమానదు.

బాహుబలి సాధ్యం చేసింది కదా అనే కామెంట్ రావొచ్చు. కానీ అది ఫాంటసీ మూవీ. తెరకు ఏనాడో దూరమైన రాజుల నేపధ్యానికి గ్రాఫిక్స్ తోడవ్వడంతో ముందునుంచే విపరీతమైన ఆసక్తి రేపింది. కానీ సాహో కేసు వేరు. ఎన్ని వందల కోట్లు ఖర్చు పెట్టినా ఇదొక కమర్షియల్ యాక్షన్ మూవీ. బాహుబలితో సమానంగానో లేక అంతకన్నా ఎక్కువగానో ఆశించడం వర్క్ అవుట్ అవ్వొచ్చు కాకపోవచ్చు అని ఖచ్చితంగా చెప్పలేం. టాక్ యునానిమస్ గా వస్తే ఎలాంటి ప్రాబ్లమ్ లేదు. వసూళ్లు గ్రాఫ్ కూడా అంతకంతా పెరుగుతూ పోతుంది. ఏ మాత్రం చిన్న తేడా వచ్చినా చెల్లించాల్సిన మూల్యం చిన్నదిగా అయితే ఉండదు

    

Tags:    

Similar News