అవతార్ ఫ్రాంఛైజీ నుంచి రెండో భాగం (అవతార్ 2) డిసెంబర్ 16న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఇప్పటికే 2.2 బిలియన్ డాలర్ల మేర వరల్డ్ వైడ్ బిజినెస్ సాగించిందని సమాచారం. అంటే దాదాపు 16000 కోట్ల మేర బిజినెస్ చేసింది. అవతార్ 1 సాధించిన 2 బిలియన్ డాలర్ల వసూళ్లకు సమానంగా పార్ట్ 2 బిజినెస్ ని పూర్తి చేసింది. దీనిని బట్టి అంతకుమించి వరల్డ్ వైడ్ షేర్ ని రాబట్టాల్సి ఉంటుందని ట్రేడ్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. నిజానికి అవతార్ 2 చిత్రం లాంగ్ రన్ లో మునుపటి రికార్డులన్నిటినీ బ్రేక్ చేస్తుందని అంచనా వేస్తున్నారు. రిలీజైన తొలి మూడు వారాల్లోనే బ్రేక్ ఈవెన్ సాధిస్తుందని కూడా విశ్లేషిస్తున్నారు. అలాగే అవతార్ 2 కేవలం భారత దేశం నుంచి 500-700 కోట్ల మేర వసూలు చేస్తుందని అంచనా వేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోను 100 కోట్లు మినిమంగా వసూలు చేసేంత క్రేజ్ అవతార్ 2 కి ఉందని విశ్లేషణలు సాగుతున్నాయి.
ఇండియాలో పూనకాలే పూనకాలు 'అవతార్: ది వే ఆఫ్ వాటర్' రాక కోసం భారత దేశం ఎంతో ఉత్కంఠగా వేచి చూస్తోంది. ఈ ఉత్సాహం ఏ రేంజులో ఉందో అర్థం చేసుకోవాలంటే అడ్వాన్స్ బుకింగ్ లను పరిశీలిస్తే అర్థమవుతోంది. ట్వంటీయత్ సెంచరీ స్టూడియోస్ ఇండియా గణాంకాల ప్రకారం.. కేవలం మూడు రోజుల వ్యవధిలో 45 స్క్రీన్ లలో ఈ చిత్రానికి సంబంధించిన 15000 టిక్కెట్లు ప్రీమియం ఫార్మాట్ లలో ఇప్పటికే అమ్ముడయ్యాయి.డిసెంబర్ 16న థియేటర్లలో సినిమా విడుదల కావడానికి ఇంకా మూడు వారాల సమయం ఉన్నందున అడ్వాన్స్ సేల్స్ మరింత పెరిగే అవకాశం ఉందని తెలిసింది.
PVR పిక్చర్స్ CEO ఒక ప్రకటనలో మాట్లాడుతూ-''జేమ్స్ కామెరూన్ సినిమాలు భారతీయ బాక్సాఫీస్ పై ప్రతిసారీ ఏదో ఒక మాయాజాలం సృష్టిస్తూనే ఉన్నాయి. ప్రేక్షకులు అలాంటి మరో దృశ్యం కోసం ఎదురు చూస్తున్నారు! అడ్వాన్స్ బుకింగ్ లపై భారీ స్పందన వచ్చింది. ఇది కేవలం ప్రీమియం ఫార్మాట్ (అధిక టికెట్ ధర) అమ్మకాల గురించి నేను చెబుతున్న మాట. ఇతర అన్ని ఫార్మాట్ లలో టికెట్ల అమ్మకాలు నేటి నుంచి ఓపెనవ్వడంతో ఇంకా భారీ సంఖ్యలను ఆశిస్తున్నాము!'' అని అన్నారు.
అవతార్ కి కొనసాగింపు భాగం భారీ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అవుతుందని ఐనాక్స్ లీజర్ లిమిటెడ్ చీఫ్ ప్రోగ్రామింగ్ ఆఫీసర్ రాజేందర్ సింగ్ జ్యాలా అన్నారు. చాలా INOX థియేటర్లలోని మా ప్రీమియం ఫార్మాట్ షో టికెట్లన్నీ ఇప్పటికే అమ్ముడయ్యాయి. ఇది మాకు అద్భుతమైన గుడ్ న్యూస్. మేము 3D - 2D ఫార్మాట్ ల బుకింగ్‌లను ప్రారంభించిన తర్వాత బుకింగ్ సంఖ్యలు గణనీయంగా పెరుగుతాయి'' అని విశ్లేషించారు.
సినీపోలిస్ CEO దేవాంగ్ సంపత్ మాట్లాడుతూ-''అవతార్ 13 సంవత్సరాల క్రితం విడుదలైనప్పుడు ఈ చిత్రానికి భారీ స్పందనను చూసి మేం మంత్రముగ్దులయ్యాం. ఇది అప్పట్లో బ్లాక్ బస్టర్ .. ఇప్పటికీ సినీ ప్రేక్షకుల హృదయాలను శాసిస్తోంది. భారతదేశంలోని ప్రేక్షకులు ఎల్లవేళలా లార్జర్-దన్-లైఫ్ ఎంటర్ టైనర్ లపై గొప్ప ప్రేమను కురిపిస్తూనే ఉంటారు. ఒక్క రోజులోనే మేము భారతదేశం అంతటా టికెట్ల అమ్మకాల్లో పార్ట్ 2కి అద్భుతమైన స్పందనను పొందాం. ప్రపంచంలోనే అత్యుత్తమ 3డి టెక్నాలజీ అయిన సినెపోలిస్ రియల్ డి 3డిలో సినిమాను చూడండి'' అని అన్నారు.
జేమ్స్ కామెరూన్ దర్శకత్వం వహించిన అవతార్ 2009లో విడుదలైంది. ఇందులో జో సల్దానా- సామ్ వర్తింగ్టన్- సిగౌర్నీ వీవర్- లాజ్ అలోన్సో నటించారు. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా సంచలన విజయం సాధించింది. దాదాపు 16వేల కోట్లు వసూలు చేసింది. ఇప్పుడు ఈ సంఖ్యకు సమానమైన బిజినెస్ చేసిన అవతార్ 2 అంతకుమించి వసూలు చేస్తుందని ట్రేడ్ భావిస్తోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.