భార్యను రాజమౌళి ఏమని పిలిచాడో తెలుసా.?

Update: 2018-07-21 11:10 GMT
బాహుబలితో రాజమౌళి క్రేజ్ ప్రపంచవ్యాప్తం అయ్యింది. ఇప్పుడు ఆయన ఒక స్టార్ దర్శకుడు. బాహుబలి లాంటి గొప్ప చిత్రాన్ని తీసిన రాజమౌళి ప్రతిభకు ఇప్పటికే ఎన్నో అవార్డులు దక్కాయి. తాజాగా చైన్నైలో జరిగిన బీహైండ్ ఉడ్స్ అవార్డు ల కార్యక్రమంలో రాజమౌళికి ‘గోల్డ్ మెడల్ ఫర్ ది విజినరీ ఆఫ్ ఇండియన్ సినిమా’ అనే అవార్డును ప్రధానం చేసి సత్కరించారు. ఈ అవార్డును ప్రఖ్యాత దర్శకుడు ఎస్పీ పుత్తురామన్ అందజేశారు.  బాహుబలి చిత్రంతో భారతీయ సినిమాను ప్రతిష్టను రాజమౌళి సార్ ప్రపంచానికి చాటారని.. అలాంటి వ్యక్తికి ఏవీఎం అవార్డును ఇవ్వడం సంతోషంగా ఉందని పుత్తురామన్ అన్నారు. తమిళ ఇండస్ట్రీ సినీ ప్రముఖులతో పాటు అనుష్క - రమ్యక్రిష్ణ  -నాజర్ లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

అవార్డు కార్యక్రమంలో రాజమౌళికి జన్మలో మరిచిపోలేని గౌరవం దక్కింది. అవార్డు తీసుకోవడానికి రాజమౌళి పేరు ప్రకటించగానే సభకు వచ్చిన ప్రేక్షకులందరూ లేచి నిలబడి కరతాళ ధ్వనులతో ఆయనను ఆహ్వానించడం విశేషంగా చెప్పవచ్చు. 

ఈ అవార్డు అందుకోవడానికి రాజమౌళిని సతీసమేతంగా రావాలని నిర్వాహకులు ఆహ్వానించారు. దీంతో వేదికపైనున్న రాజమౌళి.. తన భార్య రమని ఉద్దేశించి ‘చిన్ని.. వేదికపైకి రారా’ అంటూ పిలిచాడు. దాంతో ఆమె సభావేదికపైకి వచ్చారు. అవార్డు అందుకున్న తర్వాత రాజమౌళి దంపతులు ర్యాంప్ పై నడిచి అలరించారు. దీనికి సభకు వచ్చిన ప్రేక్షకులు కేకలు - ఈలలతో హోరెత్తించారు.

అవార్డు తీసుకున్న అనంతరం రాజమౌళి ఎమోషనల్ స్పీచ్ చేశాడు. ‘దర్శకుడిని కాకముందు నా జీవితంలో తొలిసారి ఏవీఎం స్టూడియోలో అడుగుపెట్టినప్పుడు ఓ సంఘటన చోటుచేసుకుంది. అటూ ఇటూ చూస్తూ ఏవీఎం స్టూడియోలోకి అడుగుపెడుతుండగా.. గేట్ కీపర్ ఆపాడు. పోనివ్వలేదు. అలాంటి చోటనే ఏవీఎం అధినేత పేరుతో అవార్డును అందకోవడం గర్వంగా ఉందని’ రాజమౌళి ఉద్వేగంతో చెప్పుకొచ్చాడు.
Tags:    

Similar News