ఫ్యామిలీకి ఆ బ్యూటీ రొమాన్స్ నచ్చలేదట!

Update: 2018-07-30 12:09 GMT
తెలుగమ్మాయిలకు ఎందుకు సినిమాల్లో పెద్దగా అవకాశాలు రావు? అందరూ దీనికి ఒకే రకంగా సమాధానం చెప్పరు.  కొంతమందేమో ఫిలింమేకర్స్ దే తప్పంటారు.   కొద్దిమంది మాత్రం వాళ్ళను సపోర్ట్ చేస్టారు.  ఎదేమైనా మెజారిటీ తెలుగు అమ్మాయిలు బోల్డ్ సన్నివేశాల్లో నటించేందుకు ఇంట్రెస్ట్ చూపరన్నది అందరికీ తెలిసిన విషయమే.  అంతెందుకు.. 'RX 100' దర్శకుడు అజయ్ భూపతి కుడా మొదట్లో ఒక తెలుగు అమ్మాయిని అనుకున్నామని కాకపొతే లాస్ట్ మినిట్లో అదే కారణం వల్ల డ్రాప్ అయిందని దాంతో ముంబై అమ్మాయిని హీరోయిన్ గా  తీసుకున్నామని తెలిపాడు.

ఇదంతా ఒక ఎత్తయితే - ఆచ్చ తెలుగు అమ్మాయి మిస్ ఇండియా అయిన శోభిత ధూళిపాళ మాత్రం 'గూఢచారి' సినిమా ప్రమోస్ లో లిప్ లాకులతో హీటు పెంచింది.  ఇది ఒకరకంగా చాలామందికి షాకే.  మరి వాళ్ళ ఫ్యామిలీ ఈ రొమాంటిక్ సీన్స్ గురించి ఎలా రియాక్ట్ అయిందని శోభితను అడిగితే ఓ ఇంట్రెస్టింగ్ ఆన్సర్ ఇచ్చింది.  "మా పేరెంట్స్ మాత్రం కొద్ది కాలానికి నా మోడలింగ్ - యాక్టింగ్ కి సంబంధిన వాటికి అలవాటు పడ్డారు. కానీ ఇతర కుటుంబ సభ్యుల నుంచి మాత్రం ఎక్కువ రిజెక్షన్ ఫేస్ చేయాల్సి వచ్చింది.  బంధువులు నా మొదటి సినిమా వస్తుందన్న విషయమే తెలీనట్టు ప్రవర్తిస్తున్నారు. ఆ సంగతేమో గానీ నేను మాత్రం నన్ను వెనక్కి లాగే వాళ్ళను ఎవరినైనా ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉన్నాను."

శోభిత తెలుగు డెబ్యు ఫిలిం 'గూఢచారి' ఆగష్టు 3 న రిలీజ్ కానుంది. మరో వైపు శోభిత ఇమ్రాన్ హాష్మి హిందీ సినిమాలోనూ-  నివిన్ పౌలీ మలయాళం సినిమాలోనూ హీరోయిన్ గా నటిస్తోంది.
Tags:    

Similar News