భారీ మార్పులతో ముస్తాబవుతున్న సుదర్శన్ థియేటర్!

Update: 2020-06-01 07:15 GMT
దేశంలో ప్రస్తుతం నిత్యావసర దుకాణాలు, ప్రభుత్వ కార్యాలయాలు.. ప్రయాణ సౌకర్యాలు అన్నిటికి అనుమతి లభించినా సినిమా థియేటర్లకు మాత్రం అనుమతి లభించలేదు. ఎందుకంటే ఇక సినిమా థియేటర్ల సంగతి చెప్పనవసరం లేదు. జనం ఎక్కువగా ఒకచోటకి చేరే అవకాశం ఉన్న ప్లేస్ సినిమా థియేటర్లే కావడంతో.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముందస్తు చర్యలు తీసుకుని థియేటర్లన్నిటికీ తాళాలు వేసాయి. ఇక త్వరలో లాక్‌డౌన్ ముగిసే సమయం దగ్గర పడుతుండటంతో థియేటర్ యాజమాన్యం.. ప్రభుత్వం నుంచి పిలుపు వస్తుందని ఆశతో ఎదురుచూస్తున్నారు. అయితే మల్టీఫ్లెక్స్ థియేటర్లతో పాటు సింగిల్ స్క్రీన్ థియేటర్ల యాజమాన్యం కూడా లాక్‌డౌన్ ఎత్తేసినా సరే.. సామాజిక దూరం పాటించాలని ముందస్తు చర్యలు తీసుకుంటున్నాయి. త్వరలో జీవన విధానంలో.. దేశంలో అన్ని పరిస్థితులు చక్కబడి, థియేటర్లకు అనుమతి వస్తే..

భయంతో ఉన్న ప్రేక్షకులను హ్యాపీ చేయడానికి థియేటర్లను సరికొత్తగా ముస్తాబు చేసేందుకు రెడీ అవుతున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ లోని ఓ ఫేమస్ థియేటర్ అలాగే ముస్తాబు అవుతుంది. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ దగ్గర 'సుదర్శన్' థియేటర్ అందరికి తెలిసిందే. ఈ థియేటర్ యాజమాన్యం సామాజిక దూరాన్ని థియేటర్లలో కూడా పాటించాలనే విధంగా అన్ని చర్యలు తీసుకుంటున్నారు. అలాగే థియేటర్స్‌కి వచ్చే ప్రేక్షకులకి మాస్క్‌ల పంపిణీతో పాటు థియేటర్ లోపల సీటు సీటుకి మధ్య 1 మీటరు దూరం ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. మొత్తంగా 400-500 సిటింగ్ ఉన్న థియేటర్‌ లో కేవలం 150-200 వరకు మాత్రమే సిటింగ్ ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇప్పటికే దాదాపు దీనికి సంబంధించి చర్చలు ముగిశాయట. లాక్‌డౌన్ ఎత్తివేసేనా కొన్ని నెలల పాటు పబ్లిక్ రారు. ఆ తర్వాత మళ్లీ పరిస్థితులు చక్కబడ్డాక మళ్లీ సీట్ల మధ్య గ్యాప్ ఫిల్ చేస్తామని సుదర్శన్ థియేటర్ యాజమాన్యం తెలిపింది.
Tags:    

Similar News