ప్రస్తుతం మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికలు రసవత్తరంగా మారిన సంగతి తెలిసిందే. ఐదారేళ్ల క్రితం నుంచే `మా` ఎన్నికలు సార్వత్రిక ఎన్నికల్నే తలపిస్తున్నాయి. తెలుగు రాష్ర్టాల్లో హాట్ టాపిక్ గా మారుతున్నాయి. రాను రాను `మా` ఎన్నికలు మరింత యుద్ద వాతావర ణా న్నే తలపిస్తున్నాయి. ఒకప్పుడు మా అధ్యక్షుడి ఎంపిక ఏకగ్రీవంగా జరిగేది. కానీ ఇప్పుడా పరిస్థితి ఎక్కడా కనిపించలేదు.
పోటీ దారుల మధ్య నువ్వా? నేనా? అన్నంత పోరు నడుస్తోంది. ఈ సారి అక్టోబర్ 10న జరిగే ఎన్నికల్లో ప్రధానంగా ప్రకాష్ రాజ్- మంచు విష్ణు ఫ్యానల్ మధ్య పోటీ నెలుకొన్న సంగతి తెలిసిందే. ఆ సంగతి పక్కనబెట్టి మా చరిత్రలోకి ఒకసారి వెళ్తే... మా ది పాతికేళ్ల చరిత్ర. నటీనటులకు సంబంధించిన సమస్యలు.. వివాదాల పరిష్కారం..సంక్షేమం కోసం ఏర్పాటు చేసారు. సినీ పరిశ్రమ మా ని ఏర్పాటు చేసింది.
అక్కినేని నాగేశ్వరరావు..కృష్ణ..కృష్ణంరాజులాంటి పెద్దల సమక్షంలో మా ఏర్పాటు జరిగింది. తొలుత మెగాస్టార్ చిరంజీవిని వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా నియమించారు. ఏఎన్నార్..కృష్ణ..కృష్ణం రాజు..మురళీ మోహన్ సలహాదారులుగా ఉన్నారు. ఆ తర్వాత రెండేళ్ల పాటు మురళీ మోహన్ నివాసంలోనే మా కార్యకలాపాలు కొనసాగాయి.
ఆ తర్వాత ఫిలిం నగర్ లో ని రామానాయుడు నిర్మించిన సొసైటీ భవనంలోని ఓ గదిలో 1993 అక్టోబర్ 4న అసోసియేషన్ కార్యాలయాన్ని ఏర్పాటు చేసారు. 150 మందితో `మా` ప్రారంభమైంది. ఆ సంఖ్య ఇప్పుడు 900 కి చేరింది. తొలుత చిత్ర పరిశ్రమ మద్రాసులో ఉండగా తెలుగు నటులంతా దక్షిణాది ఆర్టిస్ట్ అసోసియేషన్ లో ఉండేవారు. ఆ తర్వాత హైదరాబాద్ పరిశ్రమ తరలిరావడం ఎలాంటి అసోసియేషన్ లేకపోవడంతో కేరళ నటులు ఏర్పాటు చేసుకున్న అసోసియేషన్ ఆఫ్ మలయాళం(అమ్మ) స్ఫూర్తితో హైదరాబాద్ లోనే మా ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటివరకూ ఆరుసార్లు మురళీ మోహన్ అధ్యక్షుడిగా పనిచేసారు. ఆ తర్వాత రాజేంద్రప్రసాద్..శివాజీ రాజా...నరేష్ పనిచేసారు.