బాలీవుడ్ లో హృతిక్ రోషన్ ది సపరేట్ ట్రాక్. ఖాన్..కపూర్ త్రయం హీరోల నుంచి హృతిక్ ఎప్పుడు పోటీ పడాల్సిందే. అంతటి స్టార్ డమ్ ఉన్న హీరో కాబట్టే ఎంత మంది ఖాన్ లోచ్చినా..మరెంత మంది కపూర్ లు దిగినా? హృతిక్ ని టచ్ చేయలేకపోయారు. వాళ్లందరి పోటీని తట్టుకుని బాలీవుడ్ లో నిలబడిన ఏకైకహీరో. తనకంటూ ప్రత్యేకమైన ఐడెటింటీతో ముందుకెళ్తున్నారు.
ఖాన్లు..కపూర్లు కలిసొచ్చినా హృతిక్ సోలోగానే బాక్సాఫీస్ వద్ద ఎన్నో సార్లు విజయ ఢంకా మోగించారు. ఒకానొక దశలో హృతిక్ సక్సెస్ వేగం చూసి ఖాన్ లు గద్దె దించుతున్నాడా? అన్న సన్నివేశం సైతం కనిపించింది. కానీ అదే సమయంలో హృతిక్ కి రణబీర్ కపూర్ రూపంలో ఎదురు దెబ్బ తగిలింది. హృతిక్ వరుస పరాజయాలు ఎదురవుతోన్న సమయంలో కపూర్ వారసుడు రణబీర్ కపూర్ బ్యాక్ టూ బ్యాక్ సక్సెస్ లు అందుకుంటూ హృతిక్ వేగాన్ని తగ్గించాడు.
ఆ తర్వాత 'సూపర్ 30'..'వార్' లాంటి సక్సెస్ లు హృతిక్ ఖాతాలో ఉన్నా యంగ్ హీరో సక్సెస్ ముందు సీనియర్ హీరో విజయాలు చిన్నగానే కనిపించాయి. ఇప్పుడు హృతిక్ ముందున్న లక్ష్యం రణబీర్ తప్పించి తన స్థానాన్ని మళ్లీ తిరిగి పొందడం. అందుకోసం స్టార్ హీరో గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇటీవలే విక్రమ్ వేద తో భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకొచ్చాడు.
కానీ ఆ సినిమా అంచనాలు అందుకోలేదు. ప్రస్తుతం కొత్త సినిమాలతో వేగం పెంచాల్సిన ఆవశ్యకత ఉన్నా? ఆయన మాత్రం ఇంకా నెమ్మదిగానే కనిపిస్తున్నాడు. ఇప్పటికే భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ 'ఫైటర్' ని ప్రకటించారు. అందులో దీపికా పదుకొణేని హీరయిన్ గా తీసుకున్నారు. సినిమా ప్రకటనతోనే ..షూటింగ్ కి వెళ్లకుండా నే 2023 సెప్టెంబర్ లో రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు.
కానీ ఇప్పుడీ ప్రాజెక్ట్ ఏకంగా ఏడాది వాయిదా పడింది. తాజాగా కొత్త రిలీజ్ తేదిని తెరపైకి తీసుకొచ్చారు. 2024 జనవరి25న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. 75వ రిపబ్లిక్ డేని పురస్కరించుకుని చిత్రాన్ని ప్రేక్షకుల ముందకు తీసుకొస్తున్నట్లు వెల్లడించారు. ఇక ఈ సినిమాకి మరో ప్రత్యేకత ఉంది. ఇండియాలోనే తొలి ఏరియాల్ సీక్వెన్స్ చిత్రమిది.
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో సాగే కథ. అనీల్ కపూర్ కీలక పాత్ర పోషిస్తన్నాడు. సిద్దార్ధ్ ఆనంద్ దర్శకత్వం వహించనున్న సినిమా త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. మరి ఈ సినిమాతోనైనా హృతిక్ గత వైభవాన్ని అందుకుంటారేమో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.