బట్టలు బాలే.. కాని గ్లామర్ భలే

Update: 2016-07-15 17:30 GMT
సినిమా కోసం లిబర్టీ తీసుకోవడం అనేది ఓకె అనుకున్నా.. చరిత్ర మీద సినిమాను తీస్తున్నప్పుడు మాత్రం చరిత్రను వక్రీకరించకుండా చూపించాలి. అది కూడా మనకు తెలియని హరప్పా మొహంజొదారో వంటి 45వేల ఏళ్ళ క్రితంనాటి సివిలైజేషన్ గురించి చెబుతున్నప్పుడు.. కాస్త జాగ్రత్తగా ఉండాలి. అదిగో ఇప్పుడు ''మొహంజొదారో'' సినిమాతో హీరో హృతిక్‌ రోషన్‌ అండ్ డైరక్టర్ అశుతోష్‌ గొవారికర్ మాత్రం.. కాస్త పరువు తీస్తున్నారు.

అసలు టైలరింగ్ అంటే తెలియని కాలంలో.. నీటుగా చక్కగా కుట్టిన బట్టలను తన హీరో హీరోయిన్లతో వేయించాడు దర్శకుడు అశుతోష్. ఒక ప్రక్కన హృతిక్‌ రోషన్‌ వేస్కున్న బట్టలు చూసినా.. మరో ప్రక్కన హీరోయిన్‌ పూజా హెగ్డే వేసుకున్న వస్ర్తాలు మరియు వస్ర్తాలంకరణ చూసినా ఈ విషయం తేటతెల్లం అయిపోతుంది. అయినా సరే అశుతోష్‌ మాత్రం ఈ విషయంలో ఒక్క మాటైనా చెబితే ఒట్టు. ఇకపోతే బట్టలు బాలేదేమో కాని.. ఆ బట్టల్లో ఈ హీరోయిన్‌ ఒలకబోస్తున్న గ్లామర్‌ భలే భలే ఉందే అంటున్నారు వీక్షకులు.

అదిగో ఆ పోస్టర్ చూస్తున్నారుగా.. సౌత్‌ సినిమాల్లో గ్లామర్‌ ఆరబోయడానికి కాస్త సంశయించిన పూజా హెగ్డే.. బాలీవుడ్డులో మాత్రం బాగానే ఆరబోసింది. పైగా ఇదే తొలిసినిమా కాబట్టి.. ఆక్టట్టుకోవాలంటే ఆ మాత్రం సెక్స్ అప్పీల్‌ లేకపోతే కష్టం అనుకుందేమో. అసలే ఈవిడ మిస్‌ ఇండియా కంటెస్టెంటుగా ఆ బికినీ రౌండు వలనే పాపులర్‌ అయ్యింది. అందుకే ఇలాంటి సెక్సీ టచ్‌ ఇచ్చినట్లున్నారులే.
Tags:    

Similar News