సెలెబ్రిటీల జీవితాలు తెరపై చూసినంత అందంగా ఆహ్లాదంగా ఉండవు. వారి వ్యక్తిగత జీవితంలో కూడా ఎన్నో ఎత్తు పల్లాలు... కన్నీటి మరకలు పలకరిస్తూనే ఉంటాయ్. కండల వీరులు హృతిక్ జీవితమూ అంతే. భార్యతో విడిపోయిన ఒంటరిగా ఉంటున్నాడు. అతని అక్క సునయన రోషన్ పరిస్థితి కూడా అదే. భర్తతో విడాకులు తీసుకుని మానసికంగా శారీరకంగా చితికిపోయి ఇద్దరు పిల్లలతో పుట్టింటికి చేరింది. కొన్నేళ్లుగా భయంకరమైన వ్యాధితో పోరాడి విజయం సాధించింది. ఇప్పుడామె జీవితాన్ని గెలిచిన విజేత. తనలా సమస్యల సుడిగుండంలో చిక్కుకున్న వారికి ధైర్యం చెప్పేందుకు తన ఆత్మకథని బ్లాగు రూపంలో అందించనుంది. ఆ బ్లాగుకు జిందగీ అని పేరు పెట్టింది. హృతిక్ తన అక్కకు మద్దతుగా ట్విట్టర్ లో ట్వీటు చేశాడు.
సునయన రోషన్ కు ఇద్దరు పిల్లలు. భర్తతో విడిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. విపరీతమైన డిప్రెషన్ మధుమేహం హైబీపీ బారిన పడింది. వాటిని తట్టుకుని నిలబడేసరికి బేరియాట్రిక్ సర్జరీకి వెళ్లాల్సి వచ్చింది. మానసికంగా కుంగిపోవడంతో సైకియాట్రిక్ సాయం కోరాల్సి వచ్చింది. ఆ వెంటనే సర్వైకల్ క్యాన్సర్ చుట్టు ముట్టింది. అన్ని సమస్యల నుంచి ధైర్యంగా బయటపడేందుకు ఆమె తనతోనే తాను పెద్ద యుధ్దం చేయాల్సి వచ్చింది. తన పిల్లల కోసం ధైర్యంగా ప్రతి ఆరోగ్య సమస్యను ఎదుర్కొంది. చివరికి అన్నింటినీ జయించి ఆరోగ్యం వంతురాలిగా మారింది. జీవితంలో చాలా కష్టాన్ని అనుభవించింది ఆమె. సునయన జీవితమే ఒక పాఠం. ఎంతటి సమస్య వచ్చినా ధైర్యంగా నిలబడడం ఎలా అన్నది ఆమెను చూసి నేర్చుకోవచ్చు.
సునయన తన జీవితంలో ఎదురుపడిన ప్రతి కష్టాన్ని ఎలా జయించిందో చెప్పేందుకే జిందగీ అనే బ్లాగును ప్రారంభిస్తోంది. ఏప్రిల్ 25న ఆ బ్లాగ్ ప్రారంభమవుతోంది. హృతిక్ ఆ బ్లాగు ఎప్పుడు ఓపెన్ అవుతుందా ఎప్పుడు చదువుదామా అని ఎదురుచూస్తున్నట్టు ట్విట్టర్ లో పేర్కొన్నాడు. చిన్నప్పట్నించి తెలిసిన విషయాలే కావచ్చు అయినా ఆత్రుతగా ఉంది అని పేర్కొన్నాడు. బ్లాగుకు ఎంచుకున్న పేరు చాలా బాగుందని మెచ్చుకున్నాడు.