ఫోటో స్టొరీ: ఫెమినాపై వార్ జోడీ

Update: 2019-09-24 06:05 GMT
మ్యాగజైన్ కవర్ పేజి అనగానే సహజంగా హీరోయిన్లే ఉంటారు.  అందుకోసం స్టైలిష్ గానో.. హాటుగానో ఫోటోషూట్లు చేస్తారు. అప్పుడప్పుడూ హీరోలకు కూడా కవర్ పేజిపై మెరిసే అవకాశం వస్తుంది.  అయితే ఎప్పుడో అరుదుగా కానీ హీరో హీరోయిన్లు జంటగా మ్యాగజైన్ కవర్ పేజిపై కనిపించరు.  తాజాగా బాలీవుడ్ జోడీ హృతిక్ రోషన్ - వాణి కపూర్ జంట ఫెమీనా మ్యాగజైన్ కవర్ పేజిపై కనిపించారు.

హృతిక్.. వాణి 'వార్' సినిమాలో జోడీగా నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా అక్టోబర్ 2 న ప్రేక్షకులముందుకు రానుంది.  సినిమా రిలీజ్ లోపు ఈ జోడీ తమ మధ్యలో ఉన్న కెమిస్ట్రీ ఎలాంటిదో ఇదో శాంపిల్ అన్నట్టుగా అక్టోబర్ నెల ఫెమినా మ్యాగజైన్ కు పోజిచ్చారు.  ఈ సంచికలో ఈ ఇద్దరిపై 'ది హాటెస్ట్ న్యూ పెయిర్ హృతిక్ రోషన్ & వాణి కపూర్' అనే కథనం కూడా ప్రచురించారు.  ఇద్దరూ హాటెస్ట్ పెయిర్ లాగానే కనిపిస్తున్నారు. ఈయనేమో బాలీవుడ్ గ్రీక్ గాడ్.. ఆవిడేమో హాటెస్ట్ బికినీ బ్యూటీ. ఇద్దరూ కలిసి స్టెప్పులేసిన 'ఘుంగ్రూ' పాట కొద్ది రోజుల క్రితం రిలీజై భారీ స్పందన దక్కించుకుంది. ఆ పాటలో హాటెస్ట్ కపుల్ లాగానే కనిపించారు.

అయితే ఈ సినిమా విజయం ఇద్దరికీ చాలా అవసరం.  హృతిక్ లాస్ట్ సినిమా 'సూపర్ 30' బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ గా నిలిచింది.  మరోవైపు వాణి కూడా హిట్స్ లేక ఇబ్బంది పడుతోంది. 'వార్' హిట్ అయితే కానీ ఇద్దరికీ ఊరట లభించదు.  ఈ సినిమా మన మెగాస్టార్ చిరంజీవి 'సైరా' కు పోటీగా రిలీజ్ అవుతోంది.

Tags:    

Similar News