ఫ‌ర్హాన్ పెళ్లిలో క్రిష్ సంద‌డి అంతా ఇంతా కాదు!

Update: 2022-02-20 12:04 GMT
ద‌ర్శ‌క‌నిర్మాత న‌టుడు ఫర్హాన్ అక్త‌ర్ రెండో వివాహం చేసుకున్నారు. ఆయ‌న గ‌త కొంత‌కాలంగా న‌టి గాయ‌ని శిభాని దండేక‌ర్ తో లివిన్ రిలేష‌న్ షిప్ లో ఉన్న సంగ‌తి తెలిసిందే.  నేడు ఖండాలాలోని జావేద్ అక్తర్- షబానా అజ్మీల ఫామ్ హౌస్ లో జరిగిన క్రిస్టియన్ వివాహ వేడుకలో చాలా మంది స్నేహితులు దంపతుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

ఈ వివాహ వేడుకకు బాలీవుడ్ ప్రముఖులు హృతిక్ రోషన్- రియా చక్రవర్తి - రాకేష్ ఓంప్రకాష్ మెహ్రాతో సహా చాలా మంది స్నేహితులు  దంపతుల కుటుంబ సభ్యులు హాజరయ్యారు. ఫర్హాన్ -షిబానీ వివాహం చేసుకోవాలని నిర్ణయించుకోవడానికి ముందు నాలుగు సంవత్సరాలుగా డేటింగ్ చేస్తున్నారు.

ఫర్హాన్ ఇంతకుముందు అధునా భబానీని వివాహం చేసుకున్నాడు, అతనికి ఇద్దరు కుమార్తెలు షాక్య - అకీరా ఉన్నారు. ఇప్పుడు శిభాని రెండో బార్య. తాజాగా పెళ్లి వేడుక‌ల నుంచి విడుద‌లైన ఫ‌ర్హాన్ - హృతిక్ డ్యాన్సింగుల వీడియో అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారింది. ఆ ఇద్ద‌రూ క‌లిసి ప‌లు చిత్రాల‌కు ప‌ని చేశారు. ఇంత‌కుముందు జింద‌గి న మిలేగి దొబారా లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ లో న‌టించారు. ఫ‌ర్హాన్ - హృతిక్ కాలేజ్ డేస్ నుంచి ఎంతో స‌న్నిహితులు స్నేహితులు..

కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే.. ఫ‌ర్హాన్  చివరిగా బాక్సింగ్ డ్రామా `తూఫాన్‌`లో కనిపించాడు. అతను ప్రస్తుతం `జీ లే జరా` చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో ప్రియాంక చోప్రా జోనాస్- కత్రినా కైఫ్- అలియా భట్ నటిస్తున్నారు. షిబాని చివరిగా వెబ్-సిరీస్ ఫోర్ మోర్ షాట్స్ ప్లీజ్ రెండవ సీజన్ లో కనిపించింది.


Full View
Tags:    

Similar News