45 వయసులోనూ రోజుకు మూడు గంటలు జిమ్ లో శ్రమించడమంటే ఆషామాషీనా? కానీ 3-4 గంటలు కేవలం జిమ్ కే కేటాయిస్తూ ఫిట్ బాడీని మెయింటెయిన్ చేస్తున్నాడు గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్. 6ప్యాక్ ని కంటిన్యూ చేసేందుకు చాలానే శ్రమిస్తున్నాడు. ట్యాలెంటెడ్ యంగ్ హీరోలతో పోటీపడుతూ ఫిజిక్ ని మెయింటెయిన్ చేయాలంటే ఆమాత్రం శ్రమించాల్సిందేనని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఖాన్ లకే చెందుతుంది! అన్న చోట తానేంటో చూపించడంలో హృతిక్ సాధించిన విజయం వెనక ఈ తపన- హార్డ్ వర్క్ ఫలించిందని చెప్పొచ్చు. ప్రస్తుతం హృతిక్ రోషన్ వరుసగా సినిమాలకు కమిటవుతూ బిజీబిజీగా ఉన్నాడు.
హృతిక్ నటించిన తాజా చిత్రం `సూపర్ 30` ఈనెలలో రిలీజ్ కి వస్తున్న సంగతి తెలిసిందే. గణిత శాస్త్రజ్ఞుడు ఆనంద్ కుమార్ జీవితకథతో తెరకెక్కింది. ఈ సినిమాతో పాటు యశ్ రాజ్ ఫిలింస్ నిర్మిస్తున్న వేరొక భారీ యాక్షన్ చిత్రంలోనూ నటిస్తున్నాడు. ఇందులో యంగ్ హీరో టైగర్ ష్రాఫ్ మరో కథానాయకుడిగా నటిస్తున్నాడు. నా ముందు నిలబడే దమ్ము- ధైర్యం కేవలం అతడికి మాత్రమే ఉంది. అందుకే టైగర్ తో కలిసి నటిస్తున్నానని హృతిక్ సరదాగా వ్యాఖ్యానించారు.
లేటెస్టుగా జీక్యూ ఇంటర్వ్యూలో తన హెల్త్ కండిషన్ గురించి హృతిక్ మాట్లాడుతూ ఎవరికీ తెలీని షాకిచ్చే రహస్యాల్ని లీక్ చేశారు. ``నేనేమీ ఫిట్టెస్ట్ గయ్ ని కాదు. గొప్ప నటుడిని కూడా కాదు. ఈ రెండిటికి నేను పూర్తి ఆపోజిట్. ఈ స్థితిలో సినిమాలు చేయడం అన్నది నాకు కష్టమే. అయితే ఈ సన్నివేశం నుంచి బయటపడేందుకు నేను చాలానే చేస్తాను. వేకువ ఝామున 6 గంటలకే నిద్ర లేస్తాను. వెన్ను నొప్పి.. మోకాలి నొప్పి.. భుజాల నొప్పి.. విరిగిపోయిన ఎముకలు.. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని కసరత్తులు చేస్తాను. సూపర్ 30 కోసం చాలానే శ్రమించాను`` అని తెలిపారు. కాబిల్.. సూపర్ 30 తరహా సినిమాలు చేశాక కొంచెం వినోదం కోసం టైగర్ తో కలిసి కామెడీ పండించానని హృతిక్ వెల్లడించారు. హృతిక్ హీరోగా రాకేష్ రోషన్ నిర్మించే క్రిష్ 4 గురించి అభిమానుల్లో చాలా కాలంగా ఆసక్తికర చర్చ సాగుతోంది. అయితే దాని గురించిన తాజా సమాచారం రివీల్ కావాల్సి ఉందింకా.