బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్.. సుజానే ఖాన్ జంట తమ పద్నాలుగేళ్ళ వివాహబంధానికి 2014లో ముగింపు పలికిన సంగతి తెలిసిందే. ఈ జంటకు ఇద్దరు కుమారులున్నారు. విడిపోయినా పిల్లలిద్దరికోసం తరచుగా కలుస్తూనే ఉన్నారు. కాకపొతే ఈమధ్య ఆ కలవడం కాస్త ఎక్కువ కావడంతో మళ్ళీ ఇద్దరూ ఒక్కటవుతున్నారని బాలీవుడ్ మీడియాలో కథనాలు హల్చల్ చేస్తున్నాయి.
పిల్లలను తీసుకుని ఇద్దరూ విదేశీ టూర్లకు వెళ్ళడమే కాదు.. ముంబైలో కూడా సినిమాలకు షికార్లకు తిరుగుతున్నారట. రీసెంట్ గా హృతిక్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా తమ ఫోటో పోస్ట్ చేసి ఒక ఎమోషనల్ మెసేజ్ పెట్టాడు. ఆ ఫోటోలో హృతిక్ తనపిల్లలతో బీచ్ లో ఎంజాయ్ చేస్తుండగా సుజానే వారికి ఫోటోలను తీస్తోంది. దీనికి క్యాప్షన్ గా "ఇక్కడ ఉండేది సుజానే.. నా క్లోజెస్ట్ ఫ్రెండ్(నా మాజీ భార్య కూడా) మా ఫోటోలు తీస్తోంది. ఇదో ప్రత్యేక క్షణం. ఇది మా పిల్లకు ఒక కథ చెబుతుంది. అదేంటంటే.. ఎన్నోరకాలుగా విడిపోయిన ప్రపంచంలో కూడా కలిసి ఉండడం సాధ్యమే. మీకు వేరే అభిరుచులు ఉండవచ్చు.. కానీ ఐకమత్యంగా ఉండవచ్చు. ఇది కలిసి ఉండే.. సహనపూర్వకమైన.. ధైర్యంగా ఉండే ప్రేమ ప్రపంచం. ఇదంతా ఇంటివద్దే మొదలవుతుంది."
మరి హృతిక్ ఏ ఉద్దేశంతో ఈ ఎమోషనల్ పోస్ట్ పెట్టాడోగానీ బాలీవుడ్ లో మాత్రం హృతిక్-సుజానే జంట త్వరలోనే కలవడం ఖాయమని అర్థాలు తీస్తున్నారు. రీసెంట్ గా సుజానే ఖాన్ నాన్నగారైన సంజయ్ ఖాన్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ హృతిక్-సుజానే మళ్ళీ కలిస్సి జీవిస్తారనే నమ్మకం తనకుందని వ్యాఖ్యానించడం కూడా ఈ కథనాలకు బలం చేకూరుస్తోంది.