యాక్షన్ స్టార్ హృతిక్ రోషన్ - దీపికా పదుకొనే జంటగా సిద్దార్ధ్ ఆనంద్ దర్శకత్వంలో `ఫైటర్` తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇందులో హృతిక్-దీపిక ఫైలెట్ పాత్రల్లో కనిపించనున్నారు. వాళ్లిద్దరికి గురువు పాత్రలో సీనియర్ పైలెట్ రో ల్ ని అనిల్ కపూర్సి పోషిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకి సంబంధించి ఇంట్రెస్టింగ్ అప్ డేట్ రివీల్ అయింది.
ఇటీవలే యూనిట్ 10 రోజుల తొలి షెడ్యూల్‌ని అస్సాంలో ముగించారు. తదుపరి షెడ్యూల్ ని 2023 ప్రారంభించనున్నారు. దీంతో మేకర్స్ సహా అంతా రిలాక్స్ అవుతున్నారు. న్యూ ఇయర్ వేడుకల్లో మునిగి తేలడానికి రెడీగా ఉన్నారు. ఈ సంరద్భంగా ఓ ఇంటర్వ్యూలో హృతిక్ సినిమా గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
`నేను ఏ కథ విన్నా అది నన్ను బలంగా ప్రభావితం చేయాలి. అప్పుడే ఆ సినిమాకి సంతకం చేస్తా. అలాంటి చిత్రాల్లో ఫైటర్ ముందుంటుంది. ఇదొక డిఫరెంట్ జానర్ సినిమా. రెగ్యులర్ చిత్రాలతో పోల్చడానికి ఛాన్స్ లేదు. విజువల్ గా సినిమా హైలైట్ గా ఉంటుంది. విఎఫ్ ఎక్స్ లో న్యూ ట్రెండ్ ని అనుసరించి ముందుకెళ్తున్నాం. ఇది సినిమా స్థాయినే మార్చేస్తుంది.
సినిమాని మరో స్థాయికి తీసుకెళ్లాలి అనే నా కోరిక ఈ సినిమా తీరుతుందని భావిస్తున్నా. నన్ను ఎంతగానో ఎగ్జైట మెంట్ కి గురి చేసిన కథ. సినిమాలో చాలా ఛాలెంజింగ్ సన్నివేశాలుంటాయి. ఇలాంటి కథల్లో నటించడం ప్రతీ నటుడుకి సవాల్ లాంటిందే. వైమానిక యాక్షన్ నేపథ్యం గల చిత్రాల్ని మేకింగ్ పరంగా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి.
అవన్నీ సిద్దార్ధ్ఆనంద్ ఎంతో చక్కగా ఎగ్జిక్యూట్ చేస్తున్నారు. పిన్ టూ పిన్ ఆయన కేరింగ్ ఎంతోప్రత్యేకంగా ఉంటుంది. భారతీయ సినిమా ప్రేక్షకులకు `ఫైటర్` ఓ కొత్త అనుభూతిని కలిగిస్తుంది. హిట్ మేకర్ ఆరు సంవత్సరాల క్రితం ఫైటర్ కథని సిద్దం చేసారు. అప్పటి నుంచి తెరకెక్కించాలని అనుకుంటున్నాం. అది ఇప్పటికీ కుదిరింది. ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని షూటింగ్ సహా అన్ని పనులు పూర్తి చేసి 2024 -జనవరి 25న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.