హృతిక్ రోషన్ - కంగనా రనౌత్ ల మధ్య వివాదం.. సస్పెన్స్ థ్రిల్లర్ ని మించిపోయింది. ట్విస్ట్ ల మీద ట్విస్టులు - ఒకరిని ఒకరు కౌంటర్ చేయడాలు, అవతలి వాళ్లిచ్చిన ఆధారాల్లో లొసుగులు బయపెట్టడం.. ఇలా ఈ కథ ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. రీసెంట్ గా హృతిక్-కంగనాలు అతి దగ్గరగా ఉన్న ఓ ఫోటోని.. క్వీన్ టీం లీక్ చేసింది. దీనిపై ఇప్పుడో క్లారిటీ వచ్చేసింది.
2010లో అర్జున్ రాంపాల్ ఓ పార్టీ ఇచ్చాడు. ఆ పార్టీలో బోలెడంత మంది బాలీవుడ్ స్టార్స్ పాల్గొన్నారు. ఆ పార్టీలో హృతిక్ తో క్లోజ్ గా ఉన్న ఓ ఫోటోని.. జూమ్ చేసి క్రాప్ చేసేసి, తనతో రిలేషన్ అన్న రేంజ్ లో కంగనా బిల్డప్ ఇచ్చేసింది. ఇప్పుడీ పార్టీకి సంబంధించిన చాలా ఫోటోలు బైటకొచ్చాయి. అర్జున్ రాంపాల్ ఇచ్చిన ఈ పార్టీలో అతని భార్య మెహర్ - డినో మారియా - డైరెక్టర్ అభిషేక్ కపూర్ - డిజైనర్ నందితా మహతానీ కూడా ఉన్నారు. ఇందులో అన్నిటి కంటే పెద్ద ట్విస్ట్ ఏంటంటే.. ఆ పార్టీలో హృతిక్ రోషన్ పక్కన ఆయన మాజీ భార్య సుసానే ఖాన్ కూడా ఉంది.
హృతిక్ - సుసానే - కంగనాలు కలిసి దిగిన గ్రూప్ ఫోటోలు కూడా ఉన్నాయి. ముందు రోజు కంగనా లీక్ చేసిన ఫొటో ఈ పార్టీలోదే అని చెప్పడానికి హృతిక్ వైట్ - నందిత బ్లూ డ్రస్ లు చాలు. అంటే కంగనా కావాలనే ఇలా బిల్డప్ ఇచ్చిందనే విషయం ఇప్పుడు అర్ధమయిపోయింది. అంటే.. ఇప్పుడు మళ్లీ హృతిక్ వైపు అందరు మొగ్గాల్సిన పరిస్థితి అన్నమాట. మరిప్పుడు క్వీన్ రియాక్షన్ ఎలా ఉంటుందో?