బాలీవుడ్ సూపర్ స్టార్ హృతిక్ రోషన్.. క్వీన్ కంగనా రనౌత్ ల మధ్య వివాదం నెలల పాటు హాట్ టాపిక్ గా నడిచి ఈ మధ్యనే సర్దుకుంది. ఈ గొడవ గురించి ఈ ఇద్దరు స్టార్లు పబ్లిక్ గా మాట్లాడకూడదని నిర్ణయించుకున్నారంటూ లాయర్లు ప్రకటించాక పెద్దగా న్యూస్ రాలేదు. అయితే.. ఈ వివాదం అంతర్గతంగా ఇంకా పెరుగుతూనే ఉందని.. ఏ మాత్రం చల్లారలేదనే విషయం ఇప్పుడు బయటపడిపోయింది.
ప్రస్తుతం మొహెంజొదారో ప్రమోషన్లలో తెగ బిజీగా ఉన్నాడు హృతిక్ రోషన్. ఈ సమయంలో కంగనతో వివాదానికి సంబంధించిన ప్రశ్న ఎదురైంది. పాత మాటకే కట్టుబడి ఉంటే.. ఇప్పుడు మాట్లాడేదేం లేదంటే సరిపోయేది. కానీ హృతిక్ అలా చేయలేదు. 'నీతి లేని ప్రొఫెషనల్ కాని వాటి గురించి మాట్లాడ్డానికి ఈ ప్లాట్ ఫామ్ సరి కాదు. మరికొంత కాలం వెయిట్ చేయండి' అంటూ విరుచుకుపడ్డాడు. ఈ వివాదంలో కంగనకు విద్యా బాలన్ మద్దతుగా నిలవడం.. అందరూ హీరోవైపు మాట్లాడుతున్నారని విరుచుకుపడ్డం కూడా మాటల్లో వచ్చింది.
'నిజం మనవైపు ఉన్నపుడు ఎవరి మద్దతు అవసరం లేదు' అంటూ తప్పంతా కంగనాదే డైరెక్టుగా చెప్పేశాడు హృతిక్. కంగన చేసిన సిల్లీ ఎక్స్ కామెంట్ తో మొదలైన వివాదం.. లాయర్ నోటీసులకు చేరి తర్వాత సద్దుమణిగినా.. మళ్లీ ఇప్పుడు రాజుకుంది.