చెన్నై వరదలు చాలా నష్టాన్నే మిగిల్చాయి. లక్షలాది మందిని నరకయాతనకు గురిచేసిన ప్రకృతి బీభత్సం ఇది. ఈ వరదల్లో బాధితులకు కొంతైనా సాయం చేసేందుకు "మన మద్రాస్ కోసం" అంటూ టాలీవుడ్ ముందుకు కదిలింది. ముఖ్యంగా ఈ కేంపెయిన్ లో దగ్గుబాటి రాణా - మంచు లక్ష్మి కీలకపాత్ర పోషించారు. తమకు అందుబాటులో ఉన్న రామానాయుడు స్టూడియోస్ వేదికగా.. సాయం పంపేందుకు చర్యలు చేపట్టాడు రాణా
రాణా ఇంత యాక్టివ్ గా సహాయ కార్యక్రమాల్లో పాల్గొనడం బాలీవుడ్ స్టార్స్ ని కూడా కదిలించింది. "ఓ గొప్ప పని కోసం నిలబడి, ఆ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ, దగ్గరుండి చూసుకుంటున్నావ్, నీలాంటి గొప్ప వ్యక్తిని చూసి గర్వపడుతున్నాను" అంటూ ట్వీట్ చేశాడు బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్. అంతే కాదు.. ఓ మనిషికి చేయగల అతి గొప్ప సాయం సమయం కేటాయించి స్వయంగా కష్టపడడమే. రాణాని చూసి గర్వపడ్డమే కాదు.. స్ఫూర్తిగా తీసుకుంటున్నానని హ్రితిక్ అన్నాడు.
ఒట్టి మాటలే కాకుండా.. తన వంతుగా కొంత సాయం కూడా రాణాకు పంపాడు హ్రితిక్. సాయం చేయడంతోపాటు తనను ప్రశంసించిన హ్రితిక్ కు కృతజ్ఞతలు తెలుపుతూ ట్వీట్ చేశాడు రాణా. మరో రోజులు బాలీవుడ్ హీరో పంపిన వస్తువులు, నిధులు చెన్నైకి చేరతాయని రాణా వివరించాడు.