బాలీవుడ్ లో టాప్ డాన్సింగ్ స్టార్స్ ఎవరు అంటే ఠక్కున వినిపించే పేర్లలో హృతిక్ రోషన్ పేరు ఖచ్చితంగా ఉంటుంది. హృతిక్ కెరీర్ ఆరంభంలో దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకోవడానికి ప్రధాన కారణం ఆయన డాన్స్ అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. హృతిక్ రోషన్ నటించిన కహో నా ప్యార్ హై చిత్రంలోని డాన్స్ లు అప్పట్లో సంచలనం అయ్యాయి. ఆ తర్వాత కూడా హృతిక్ బాలీవుడ్ స్టార్స్ లో తనకంటూ ప్రత్యేకతను తన డాన్స్ తోనే ఏర్పర్చుకున్నాడు. అలాంటి హృతిక్ రోషన్ ను డాక్టర్లు కొన్ని ఆరోగ్య కారణాల వల్ల డాన్స్ కు దూరంగా ఉండమన్నారట.
బాలీవుడ్ లో తన డాన్స్ తో పాటు - యాక్టింగ్ తో స్టార్ డం దక్కించుకుని సూపర్ స్టార్ గా పేరు దక్కించుకున్న హృతిక్ రోషన్ తాజాగా ఇంటర్నేషనల్ డాన్స్ డే సందర్బంగా ఒక కార్యక్రమంలో పాల్గొన్నాడు. ఆ సమయంలో హృతిక్ రోషన్ మాట్లాడుతూ.. డాన్స్ వల్ల చాలా లాభం ఉంటుంది. శరీరంలో ఉండే క్యాలరీలు కరగడంతో పాటు - కండరాలు పటిష్టంగా తయారు అవుతాయి. నా తల్లికి మరియు పిల్లలకు కూడా క్రమం తప్పకుండా డాన్స్ వేయమని సూచిస్తాను. డాన్స్ వల్ల శరీరంలో ప్లెక్సిబులిటీ వస్తుంది, మనిషి అన్ని పనుల్లో ఉత్సాహంను కనబర్చుతాడు. అందుకే డాన్స్ అంటే నాకు ఇష్టం. కాని నా ఆరోగ్య సమస్య కారణంగా డాక్టర్లు నన్ను డాన్స్ వేయవద్దన్నారు.
నీ జీవితంలో డాన్స్ చేయవద్దని డాక్టర్లు చెప్పారు - డాక్టర్లు చెప్పినప్పటికి నేను డాన్స్ కు దూరంగా ఉండలేక పోయాను. డాక్టర్లు చెప్పిన విషయం నాకు దిగ్బ్రాంతిని కలిగించింది. అయినా డాన్స్ చేస్తున్నాను, అయితే మునుపటి వేగంతో మాత్రం నేను డాన్స్ చేయలేక పోతున్నాను. వయసు పెరుగుతున్నా కొద్ది నా డాన్స్ స్పీడ్ తగ్గించాను. డాన్స్ చేసే సమయంలో జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు - రిస్కీ స్టెప్పులను దూరం పెడుతున్నాను అంటూ హృతిక్ చెప్పుకొచ్చాడు. ఇకపై కూడా హృతిక్ డాన్స్ మనం చూడలేమని ఆయన మాటలతోనే అర్థం అయ్యింది. ప్రస్తుతం 'సూపర్ 30' చిత్రంలో నటిస్తున్నాడు. ఇదే ఏడాది జులైలో సినిమాను విడుదల చేయబోతున్నాడు. ఆ చిత్రంలో అసలు డాన్స్ ఉండక పోవచ్చు. ఎందుకంటే ఆ చిత్రం గణితశాస్త్రవేత్త బయోపిక్.