సినిమాలులో కథలు అన్నీ మన జీవితాలకు అద్దంపట్టే ప్రతిరూపాలే.ఇప్పుడు ఇండియన్ సినిమా కూడా అదే దశలో ప్రయాణం చేస్తుంది. రియల్ స్టోరీస్ ను ప్రముఖల జీవిత గాధలును సినిమా కథగా తయారుచేసి నిర్మిస్తున్నారు. అలా తీసిన సినిమాలు కూడా మంచి కమర్షియల్ హిట్ కూడా అవ్వడంతో మన స్టార్స్ కూడా చేయడానికి మంచి ఉత్సాహం చూపిస్తున్నారు. విధ్య బాలన్ ‘దర్టీ పిక్చర్’ - ఫరాన్ అఖ్తర్ ‘భాగ్ మిల్కా భాగ్’ నిన్నటి అమీర్ ఖాన్ ‘దంగల్’ వీటికి మంచి ఉదాహరణ.
ఇప్పుడు అదే బాటలో హృతిక్ రోషన్ కూడా నడవబోతున్నాడు. ఆనంద్ కుమార్ అనే ఒక గణిత శాస్త్రవేత్త జీవిత కథను క్వీన్ మూవీ డైరెక్టర్ వికాస్ బాల్ సినిమాగా తీయబోతున్నారు. ముఖ్య పాత్రకు హీరో హృతిక్ ని ఎన్నుకున్నారు. ఆనంద్ కుమార్ అనే అతను సూపర్ 30 అనే ఒక పోగ్రామ్ను నడుపుతున్నాడు. వెనకబడిన వర్గాలలో పుట్టిన ఒక 30 మంది పిల్లలను సెలెక్ట్ చేసి ట్రైనింగ్ ఇచ్చి ఐఐటి ప్రవేశ పరీక్షలో విజయం సాదించే దిశగా వాళ్ళకు అండగా ఉంటున్నాడు. ఇప్పటికే ఈయన దగ్గర చదువుకున్న స్టూడెంట్స్ చాలామంది ఐఐటి లో డిగ్రీలు చేసి లైఫ్ లో మంచి సక్సెస్ అయ్యారు. ఈ పాత్రను హృతిక్ చేయడం కాస్త ఆశక్తిగా మారింది.
హృతిక్ ఇప్పుడు తన పిల్లలుతో హాలిడేస్ ఎంజాయ్ చేస్తున్నాడు. అతను తిరిగి వచ్చిన వెంటనే ఈ సినిమా షూటింగ్ మొదలుపెడతారు అని తెలుస్తుంది. ఈ సినిమాకు టైటిల్ కూడా సూపర్ 30 అని అనుకుంటున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/