సంక్రాంతి సమరానికి రంగం సిద్ధమవుతోంది. ఎన్నడూ లేని విధంగా నలుగురు క్రేజీ హీరోలు పోటీలో ఉండటం అందులోనూ ముగ్గురు సీనియర్లు తలపడటం కథను రసవత్తరంగా మార్చేసింది. వీటి జాతకాలు ఎలా ఉంటాయా అనే దాని మీద ఎవరి అంచనాలు వాళ్లకు వేర్వేరుగా ఉన్నాయి. వాటిసంగతి అలా ఉంచితే జనవరి 9న బోణీ చేయబోతున్న ఎన్టీఆర్ కథానాయకుడు మాత్రం పెద్ద సవాలే ఎదురుకోవాల్సి ఉంటుంది. మొట్టమొదటి సారి బాలయ్య కెరీర్లోనే అత్యధిక బిజినెస్ జరుపుకున్న మూవీగా దీని మీద ట్రేడ్ భారీ పెట్టుబడులు పెట్టింది.
గౌతమిపుత్రశాతకర్ణి కన్నా మరో యాభై శాతం అదనంగా తేవాల్సిన బాధ్యతను కథానాయకుడు మోస్తున్నాడు. కాకపోతే అధిక శాతం ఏరియాలలో అడ్వాన్స్ బేసిస్ మీదే విడుదల చేస్తున్నారు నిర్మాతలు. బయోపిక్ కావడంతో పాటు మాస్ అంశాలు ఎంతమేరకు ఉంటాయన్న దాని మీద అనుమానాలు ఉండటంతో చెప్పిన ధరకు కొనేందుకు బయ్యర్లు సిద్ధ పడలేదని టాక్. ఏరియాల వారీగా జరిగిన బిజినెస్ అందిన సమాచారం మేరకు ఈ విధంగా ఉంది
నైజామ్ - 13,5 కోట్లు
సీడెడ్ - 12 కోట్లు
ఉత్తరాంధ్ర మరియు కృష్ణా - 11.4 కోట్లు
ఈస్ట్ గోదావరి - 5.4 కోట్లు
వెస్ట్ గోదావరి - 4.2 కోట్లు
గుంటూరు - 6 కోట్లు
నెల్లూరు - 2.5 కోట్లు
ఏపి/తెలంగాణ మొత్తం - 55 కోట్లు
రెస్ట్ అఫ్ ఇండియా - 6.25 కోట్లు
ఓవర్సీస్ - 10 కోట్లు
ప్రపంచవ్యాప్తం జరిగిన బిజినెస్ - 71.25 కోట్లు
బాలకృష్ణ కెరీర్లో పెద్ద హిట్ గా చెప్పుకునే గౌతమీపుత్ర శాతకర్ణి అతి కష్టం మీద 50 కోట్ల షేర్ ని టచ్ చేయగలిగింది. కథానాయకుడి బిజినెస్ దానికన్నా 50 శాతం అధికంగా జరిగింది. అంటే 72 కోట్లకు షేర్ వస్తేనే కథానాయకుడు బయ్యర్లు సేఫ్ అవుతారు. ఇది యునానిమస్ గా బ్లాక్ బస్టర్ టాక్ వస్తేనే సాధ్యం. పోటీ లేకపోతే కాస్త సులువుగా ఉండేది కానీ వినయ విధేయ రామ.-ఎఫ్2-పెట్ట లతో వసూళ్లు షేర్ చేసుకోవాలి కాబట్టి కొంత రిస్క్ అయితే ఉంది. కాకపోతే అత్యధిక థియేటర్లలో విడుదల చేస్తున్న అడ్వాంటేజ్ ని కథానాయకుడు సరిగ్గా వాడుకుంటే సేఫ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. చూడాలి మరి ఈ సవాల్ ని కథానాయకుడు ఎలా నెగ్గుతాడో
Full View