అక్కినేని వారసుడు అఖిల్ బ్యాక్ టు బ్యాక్ ప్రయత్నాలు తెలిసినదే. తొలి మూడు సినిమాలు భారీ అంచనాల మధ్య విడుదలైనా రిజల్ట్ తారుమారైంది. అయినా అఖిల్ మాత్రం కాన్పిడెన్స్ కొల్పోలేదు. ఫెయిల్యూర్స్ నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నానని తెలిపాడు. ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తన కెరీర్ నాలుగో చిత్రం `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్`లో నటిస్తున్నాడు. భాస్కర్ ఒక మంచి ప్రేమకథా చిత్రాన్ని ఎంచుకుని అఖిల్ కి బ్లాక్ బస్టర్ ఇవ్వాలని ప్రయత్నిస్తున్నాడు.
ఈ సినిమా అన్ని పనులు పూర్తిచేసుకుని రిలీజ్ కు రెడీగా ఉంది. ఇంతలోనే కరోనా సెకండ్ వేవ్ కల్లోలం మొదలవ్వడంతో వాయిదా పడింది. ఆ క్రమంలోనే అఖిల్ ఐదవ సినిమాని సురేందర్ రెడ్డితో చేయడానికి సిద్ధమయ్యాడు. ఇప్పటికే స్క్రిప్టు పనులు పూర్తి చేసారట. అలాగే అందులో లోపాలున్నట్లు గుర్తించి.. మళ్లీ రీరైట్ చేయాలని సూరి భావిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. మరి ఈ రీరైట్ దేనికి అన్న దానిపై క్లారిటీ రావాల్సి ఉంది. ఇప్పటికే కథని అఖిల్ ఒకే చేసాడు. సెట్స్ కు వెళ్లడానికి కూడా రెడీ అవ్వగా ఇది ఊహించని ట్విస్ట్.
ఇంతకీ సూరి మైండ్ లో ఏం ఉంది? అన్నది వేచి చూడాలి. తిరిగి కథలో మార్పులు చేయాలంటే.. అది పూర్తికావడానికి కనీసం నాలుగైదు నెలలు సమయం పడుతుంది. ఈ లోపు కరోనా సెకెండ్ వేవ్ కూడా అదుపులోకి వచ్చే అవకాశం ఉంది. అప్పటికి స్క్రిప్ట్ సహా క్యాస్టింగ్ ఎంపిక పనులు కూడా పూర్తి చేసేయొచ్చని అతడి ప్లాన్ అట.