సింహం ముందరా చిట్టెలుక వేషాలు? అగ్ర హీరోల సినిమాలు అరడజను బరిలోకొస్తుంటే అసలు ఏమాత్రం జంకూ గొంకూ లేకుండా యువహీరోలు పోటీకి దిగుతుండడం ఆసక్తికరంగా మారింది. 2020 సంక్రాంతి సీజన్ ని ఇప్పటికే పలువురు టాప్ హీరోలు లాక్ చేశారు. సూపర్ స్టార్ రజనీకాంత్ - నటసింహా నందమూరి బాలకృష్ణ- సూపర్ స్టార్ మహేష్- స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ వీళ్లంతా సంక్రాంతి బరిలో పందెం పుంజుల్లా బరిలో దిగుతున్నారు. అయినా ఏ మాత్రం జంకు అన్నదే లేకుండా పలువురు యువహీరో(పుంజు)లు సంక్రాంతి బరిలోనే దిగాలని నిర్ణయించుకోవడం హాట్ టాపిక్ గా మారింది.
సూపర్ స్టార్ మహేష్ హీరోగా అనీల్ రావిపూడి తెరకెక్కిస్తున్న `సరిలేరు నీకెవ్వరు` సంక్రాంతి 2020 రిలీజ్ అంటూ అనీల్ సుంకర- దిల్ రాజు బృందం ఓపెనింగు రోజే డిక్లేర్ చేసేశారు. ఆ తర్వాత గీతా ఆర్ట్స్ -హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సైతం బన్ని-త్రివిక్రమ్ కాంబినేషన్ మూవీ `అల వైకుంటపురములో` ని సంక్రాంతి వార్ లోకి తెచ్చేస్తున్నామని ప్రకటించారు. నటసింహా బాలకృష్ణ-కె.ఎస్.రవికుమార్ సినిమా ఎన్ బీకే 105ని సంక్రాంతికే రిలీజ్ చేస్తున్నామని అప్పట్లో ప్రచారమైంది. వీళ్లతో పాటే సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న `దర్బార్` చిత్రాన్ని సంక్రాంతి బరిలోనే దించుతున్నామని అధికారికంగా ప్రకటించారు.
ఇక ఇంతమంది టాప్ స్టార్ల సినిమాలు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా బరిలోకి వస్తున్నా .. ఈసారి 2020 సంక్రాంతి రేసులో పలువురు యువహీరోల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. శర్వానంద్ -కళ్యాణ్ రామ్- సాయిధరమ్- నాగచైతన్య వంటి స్టార్ల పేర్లు వినిపిస్తున్నాయి. కళ్యాణ్ రామ్ - ఎంత మంచివాడవురా (సతీష్ వేగేష్న దర్శకత్వం)... శర్వానంద్ - శ్రీకారం (కిషోర్ రెడ్డి దర్శకుడిగా పరిచయం).. సాయిధరమ్ - ప్రతి రోజు పండగే (మారుతి దర్శకత్వం) చిత్రాల్ని సంక్రాంతికి రిలీజ్ చేయాలని భావిస్తున్నారు. నాగచైతన్య నటించే సినిమాల్లో ఒకటి సంక్రాంతి బరిలో ఉండే ఛాన్సుందని అంటున్నారు. వీళ్లంతా ఎవరికి వారు కంటెంట్ పై నమ్మకంతోనే పోటీ బరిలో దిగుతున్నారు. ఏదేమైనా ఇంతమంది అగ్ర హీరోల సినిమాలు ఒకే సారి రిలీజవుతుంటే థియేటర్ల సమస్య ఉత్పన్నమవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. 2018 సంక్రాంతి రిలీజ్ ల వేళ తలెత్తినట్టే థియేటర్ల సమస్య లేకుండా ఉంటుందా? అంటే చెప్పలేం. డబ్బింగ్ సినిమాలకు థియేటర్లు ఇవ్వడం లేదన్న గోల ఎలానూ ఉండనే ఉంది. ఇంకా సంక్రాంతి రేసులో వస్తున్నామని చెప్పని వాళ్లు ఉన్నారు. దీనిని బట్టి 2020 సంక్రాంతికి ఠఫ్ కాంపిటీషన్ తప్పదని అర్థమవుతోంది.