అన్ని ప్లానింగ్ ప్రకారం జరిగి ఉంటే ఆగస్ట్ 15 సాహో రాకతో థియేటర్లు హోరెత్తిపోయేవి. కానీ రెండు వారాలు వాయిదా పడటం వల్ల అభిమానులు కొంత అసంతృప్తికి గురైనా మల్టీప్లెక్సుల యాజమాన్యాలు మాత్రం పండగ చేసుకుంటున్నాయి. కారణం సాహో లేకపోయినా క్రేజీ సినిమాలు 5 ఒకే రోజు రానుండటం. శర్వానంద్ రణరంగం అడవి శేష్ ఎవరు రెండూ సాహో డ్రాప్ కాగానే ఆ డేట్ ని లాక్ చేసుకున్నాయి. శర్వాకున్న ఇమేజ్ మార్కెట్ ఎవరుని డామినేట్ చేస్తుంది కానీ ఫైనల్ గా మాట్లాడాల్సింది కంటెంటే కాబట్టి ఇప్పటికిప్పుడు రిజల్ట్ గురించి చెప్పలేం. ఇవెలాగూ తెలుగు ప్రేక్షకులకు హాలిడే కొరతను తీరుస్తాయి.
కానీ మల్టీ ప్లెక్సుల ఆనందానికి కారణం ఇదొక్కటే కాదు. వాళ్ళ ఫీడింగ్ కి కీలకంగా నిలిచే రెండు బాలీవుడ్ సినిమాలు ఓ హాలీవుడ్ మూవీ కూడా అదే రోజు వస్తున్నాయి కాబట్టి. అక్షయ్ కుమార్ మిషన్ మంగళ్ ఇప్పటికే ట్రైలర్ తో అంచనాలు పెంచేసింది. లేడీ స్టార్ క్యాస్టింగ్ తో రియల్ టైం ఇన్సిడెంట్ ని బేస్ చేసుకుని తీసిన ఈ స్పేస్ మూవీపై ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఉన్నారు. జాన్ అబ్రహం బాట్లా హౌస్ మీద సైతం భారీ హైప్ ఉంది. ఇది కూడా నిజ జీవితంలో జరిగిన ఓ తీవ్రవాది ఎన్కౌంటర్ ఆధారంగా తీసినది కావడంతో దీని మీద చాలా ఆసక్తి నెలకొంది.
ఇంగ్లీష్ మూవీ లవర్స్ అమితంగా అభిమానించే క్వెంటిన్ టోరంటినో తీసిన ఒన్స్ అపాన్ ఏ టైం ఇన్ హాలీవుడ్ కోసం విపరీతంగా ఎదురు చూస్తున్న ప్రేక్షకుల సంఖ్య తక్కువేమీ లేదు. ఇది కూడా ఇండిపెండెన్స్ డేనే ఫిక్స్ చేసుకుంది. ఈ మూడు సినిమాలకు ఆక్యుపెన్సీ ఎక్కువగా వచ్చేది మల్టీ ప్లెక్సుల్లోనే. అందుకే ఒకటి కాదు ఏకంగా 5 సినిమాలు ఒకే రోజు వస్తాయి కాబట్టి ఈ మాల్స్ అన్ని పబ్లిక్ హాలిడే రోజు జనంతో కిటకిటలాడటం ఖాయం. దానికి తోడు లాంగ్ వీకెండ్ రావడం ఇంకో ప్లస్ గా మారనుంది.