కొన్ని వరుస ఫ్లాప్ ల తర్వాత సాయి ధరమ్ తేజ్ నటించిన తాజా చిత్రం `చిత్రలహరి`. నేను శైలజ ఫేం కిషోర్ తిరుమల దర్శకత్వం వహించారు. ప్రతిష్ఠాత్మక మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది. ఈనెల 12న రిలీజవుతున్న సంగతి తెలిసిందే. ఇటు సాయిధరమ్ కి, అటు దర్శకనిర్మాతలకు కెరీర్ పరంగా ఎంతో కీలకమైన సినిమా ఇది. ఇప్పటికే ఈ సినిమా పోస్టర్లు, టీజర్, ట్రైలర్ ప్రతిదీ సినిమాపై ఆసక్తిని పెంచాయి. యాథృచ్ఛికంగా అయినా సాయిధరమ్ తన రియల్ లైఫ్ రోల్ నే తెరపై పండిస్తుండడంతో సినిమా చూసే ఆడియెన్ కి ఆ పాయింట్ కనెక్టవుతుందనే భావన కలుగుతోంది. గెలుపుకోసం వేచి చూసే కుర్రాడిగా సాయిధరమ్ ఆహార్యం ట్రైలర్ లో ఆకట్టుకుంది.
సాయిధరమ్ ఇంటెన్స్ పెర్ఫామెన్స్ ఈ సినిమాకి ప్లస్ కానుంది. ఇక పోతే ఇదే చిత్రంతో హలో బ్యూటీ కళ్యాణి ప్రియదర్శన్, తమిళ బ్యూటీ నివేద పెథురాజ్ అదృష్టాన్ని చెక్ చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈనెల 12న చిత్రలహరి ప్రపంచవ్యాప్తంగా రిలీజవుతోంది. ఈ సందర్భంగా ఈ సినిమా ప్రీరిలీజ్ బిజినెస్ గురించి ఆసక్తికర చర్చ సాగుతోంది. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ చాలా ముందే చిత్రలహరి బిజినెస్ డీల్ పూర్తి చేసింది.
అనవసరమైన హైప్ క్రియేట్ చేయకుండా మైత్రి సంస్థ రీజనబుల్ రేట్స్ కే థియేట్రికల్ హక్కుల్ని విక్రయించారని తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ హక్కులకు 13కోట్లు దక్కిందిట. ఏపీలో ఎలక్షన్ అయిన మరుసటి రోజే ఈ చిత్రం రిలీజవుతోంది కాబట్టి.. సినిమా ఓపెనింగులకు కలిసి రానుందని అంచనా వేస్తున్నారు. సినిమా హిట్టు .. ఎమోషనల్ కంటెంట్ ఆకట్టుకుంది అన్న టాక్ తెచ్చుకుంటే `మజిలీ` తరహాలోనే వేగంగానే రికవరీ అయ్యే వీలుంటుందని టీమ్ భావిస్తోందట.