ఇప్పుడు అల్లు అర్జున్ హీరోగా 'నా పేరు సూర్య' సినిమాతో తనో డైరక్టర్ గా మారుతున్నాడు వక్కంతం వంశీ. ఒక కథకు కోటి రూపాయలు తీసుకునే రేంజుకు చేరుకున్న వక్కంతం అంటే ఇండస్ర్టీలో బాగా పాపులర్. అలాగని ఈయన రాసిన కతలన్నీ బంపర్ హిట్లు కాలేదు. అడపాదడపా ఫ్లాపులు కూడా అయ్యాయ్. అందుకే ఇప్పుడు వక్కంతం డైరక్టర్ గా మారి తనలోని అసలు టాలెంట్ చూపించాలని శతవిదాలా ప్రయత్నిస్తున్నాడు.
విషయం ఏంటంటే.. ఇప్పుడు డిజె దువ్వాడ జగన్నాథమ్ సినిమాతో అల్లు అర్జున్ చాలా నెగెటివిటీ పోగేసుకున్నాడు. మనోడు ఇప్పుడు ఏం చేసినా కూడా నెగెటివ్ అయిపోతోంది. అవన్నీ అటుంచితే డిజె సినిమాలో ఒక ఆర్డినరి స్టోరి తప్పించి ఏమీ లేదు. అంతకుముందు వచ్చిన సరైనోడు సినిమాలో కూడా స్టోరీ ఏం లేదు కాని బోయపాటి శ్రీను స్ర్కీన్ ప్లే అండ్ ట్రేడ్ మార్కు టేకింగ్ కారణంగా బాగానే అనిపించింది. కాని హరీశ్ శంకర్ దగ్గరకు వచ్చేసరికి పంచులు ఎక్కువ పాయింట్లు తక్కువ అన్న చందాన పరిస్థితి మారిపోయింది. దానికి తోడు ఈ బ్యాచ్ క్రిటిక్స్ ను విపరీతంగా విమర్శించేయడంతో.. ఈసారి బన్నీ సినిమాను అందరూ ఇంకాస్త క్షుణ్ణంగా చూసే ఛాన్సుంది. కాబట్టి ఇప్పుడు ఆ ప్రెజర్ అంతా వక్కంతంపై పడుతోందని వేరే చెప్పక్కర్లేదు.
మరో ప్రక్కన చూస్తే పాటల నుండి కాస్ట్యూమ్స్ వరకు.. లొకేషన్ల నుండి కెమెరా మ్యాన్ వరకు అన్నీ హీరోయే స్వయంగా హ్యాండిల్ చేస్తుంటే.. మరి దర్శకుడు ఏం చేస్తాడు అనే మాట కూడా వినిపిస్తోంది. వీటన్నింటినీ తట్టుకొని బయటకొచ్చి వక్కంతం వంశీ తన మార్కును చూపించాల్సి ఉంటుంది.