బాహుబలి చిత్రం తర్వాత ప్రభాస్ చేసిన సినిమా 'సాహో'. సుజీత్ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ వారు ఏకంగా 350 కోట్ల బడ్జెట్ తో సాహోను నిర్మించారు. ఆగస్టు 30న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సాహో చిత్రం ఇటీవల 50 రోజులు పూర్తి చేసుకుంది. ఇప్పటి వరకు దాదాపుగా 425 కోట్ల కలెక్షన్స్ ను ఈ చిత్రం రాబట్టిందని సమాచారం అందుతోంది. థియేటర్లలో ఈ చిత్రం ఫుల్ రన్ దాదాపుగా పూర్తి అయ్యింది. ఒప్పందం ప్రకారం 50 డేస్ వెయిట్ చేసిన అమెజాన్ ప్రైమ్ సాహో సినిమాను స్ట్రీమ్ మొదలు పెట్టింది.
అమెజాన్ ప్రైమ్ లో సాహో సినిమాను తెలుగు.. హిందీ.. తమిళం.. మలయాళం.. కన్నడంలో స్ట్రీమ్ చేస్తున్నారు. సినిమాను థియేటర్లలో చూడలేక పోయిన వారు.. టికెట్ల పెంపు ఇంతరత్ర కారణాల వల్ల థియేటర్ల వరకు వెళ్లలేక పోయిన వారు సాహో సినిమా ఎప్పుడెప్పుడు అమెజాన్ లో వస్తుందా అంటూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. హిందీలో సినిమా భారీ వసూళ్లు సాధించింది. అయినా ఇంకా అక్కడ ప్రేక్షకులు సాహో ను అమెజాన్ లో విపరీతంగా చూసేస్తున్నారట.
ఈ వీకెండ్ లో సాహో చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్ లో పెద్ద ఎత్తున చూస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. చూసిన వారు కూడా మళ్లీ సాహోను చూస్తున్నారు. సాహో అమెజాన్ ప్రైమ్ వ్యూస్ అధికారికంగా తెలియదు కాని.. బాలీవుడ్ కొత్త సినిమాలను మించి సాహో వ్యూస్ సంఖ్య ఉందని విశ్వసనీయ సమాచారం ద్వారా తెలుస్తోంది. తెలుగు వర్షన్ వ్యూస్ కూడా భారీగా ఉన్నాయట. ఇతర భాష ప్రేక్షకులకు కూడా సాహో సినిమాను చూసేందుకు ఎంతో ఆసక్తిని చూపుతున్నారు.
ఈ వీకెండ్ లో అందరిని.. అన్ని భాషల వారికి సాహో మాత్రమే ఆన్ లైన్ లో స్ట్రీమింగ్ కు కనిపిస్తుందట. అమెజాన్ ప్రైమ్ అన్ని భాషలకు కలిపి దాదాపుగా 40 కోట్ల రూపాయలకు సాహోను కొనుగోలు చేసినట్లుగా సమాచారం అందుతోంది. సినిమాకు వస్తున్న రెస్పాన్స్ చూస్తే ఈజీగానే అమెజాన్ తన పెట్టుబడిని రాబట్టుకోవడం ఖాయంగా కనిపిస్తుందని మార్గెట్ వర్గాల వారు అంటున్నారు.