టాటా అన్న పదం వినని భారతీయుడు ఉండడు. దేశ విదేశాల్లో టాటా అంటే ఒక బ్రాండ్. టాటా గ్రూప్ సంచలన విజయాల గురించి ఎంత చెప్పినా తక్కువే. ముఖ్యంగా రతన్ టాటా తమ సంస్థానాన్ని అభివృద్ధి చేసేందుకు చేసిన కృషి అద్వితీయమైనది.
విమానాశ్రయంలో విమానాలను కడిగేందుకు నియమితుడైన ఒక సాధారణ ఉద్యోగి బిజినెస్ మేన్ గా మారడం దగ్గర నుంచి అసాధారణ పారిశ్రామిక వేత్తగా ఎదిగిన వైనం అదే క్రమంలో ఆ కుటుంబం చేసిన హార్డ్ వర్క్ నైతిక విలువలు ఇలా అన్నిటినీ ఒక సిరీస్ రూపంలో తెరకెక్కించనున్నారు.
`ది టాటాస్` పేరుతో ప్రఖ్యాత టి-సిరీస్ ఈ వెబ్ సిరీస్ ని రూపొందించనుంది. నిర్మాత భూషణ్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. టాటా గ్రూప్ వెనుక ఉన్న లెజెండరీ బిజినెస్ ఫ్యామిలీ కథాంశంతో రూపొందించనున్న సిరీస్ ఇది. ఈరోజు పోస్టర్ తో సినిమాని ప్రకటించారు మేకర్స్.
గిరీష్ కుబేర్ రాసిన అదే పేరుతో ఉన్న పాపులర్ పుస్తకం ఆధారంగా ఈ సిరీస్ తెరకెక్కనుంది. ఆల్మైటీ మోషన్ పిక్చర్ సంస్థ టీసిరీస్ తో సహ-నిర్మాణంలో ఉంటుంది. ప్రతిభావంతులైన నటీనటులు సాంకేతిక నిపుణులను ఎంపిక చేయనున్నారని తెలిసింది.
మరిన్ని వివరాలు త్వరలో వెల్లడిస్తానని మేకర్స్ ప్రకటించారు. ది టాటాస్ పోస్టర్ వైరల్ గా దూసుకెళుతోంది. ప్రపంచానికి సరికొత్త దారులను అన్వేషించిన టాటా సంస్థ చరిత్రపై ఈ సిరీస్ యువతరానికి ఎంతో స్ఫూర్తి దాయకంగా ఉంటుందనడంలో సందేహం లేదు.