నాని..కాళికా సెట్..నరబలి ఎలిమెంట్?

Update: 2021-04-23 08:00 GMT
కోల్‌కత్తా నగరాన్ని హైదరాబాద్‌ కి తీసుకువచ్చారు నాని. ముఖ్యంగా అందులో వంద సంవత్సరాల క్రితం నాటి పాత కాళికా దేవి టెంపుల్ ఉంది. ఇప్పుడు ఎక్కడ విన్నా దాని గురించిన కబుర్లే. నాని హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘శ్యామ్‌ సింగరాయ్‌’. ఈ సినిమా కోసమే హైదరాబాద్‌లో కోల్‌కత్తాని సృష్టించారు. రాహుల్‌ సంకృత్యాన్‌ దర్శకత్వంలో వెంకట్‌ బోయనపల్లి నిర్మిస్తున్న ఈ చిత్రంలో సాయిపల్లవి, కృతీ శెట్టి, మడోనా సెబాస్టియన్‌ హీరోయిన్స్. ఈ సినిమా కోసం ఆర్ట్‌ డైరెక్టర్‌ అవినాష్‌ కొల్ల కోల్‌కత్తా ను తలపించే భారీ సెట్‌ ను హైదరాబాద్‌ లో సృష్టించారు. ఆరున్నర కోట్లతో పదెకరాల్లో నిర్మించిన ఈ భారీ సెట్‌లో ఫైనల్‌ షెడ్యూల్‌ షూటింగ్‌ జరుగుతోంది. అయితే ఆ సెట్ లోనే జరగటం వెనక కథేంటి అన్నది ఫిల్మ్ సర్కిల్స్ లో డిస్కషన్ గా మారింది.

సినీ జనాలు చెప్పుకునేదాన్ని బట్టి ఈ సినిమాలో ఫ్లాష్ బ్యాక్ లో సీన్స్ ఈ సెట్ లో జరుగుతాయట. కోలకత్తా నేపధ్యంలో ఆ సీన్స్ ప్లాన్ చేసారు. ముఖ్యంగా కాళికాదేవి టెంపుల్ ,అక్కడ వందసంవత్సరాల క్రితం నరబలి ఉండేదని, దాని చుట్టు కొన్ని ఇంట్రస్టింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయని అంటున్నారు. పునర్జన్మ నేపధ్యంలో కథ జరుగుతుందని వినికిడి. ఆ కాళికాదేవి ఆలయంలో జరిగే సీన్ ఇంట్రవెల్ లో వస్తుందని అది షాకింగ్ కు గురి చేస్తుందని అంటున్నారు. అయితే ఈ మ్యాటర్ లో ఎంతవరకూ నిజం ఉందనేది తెలియాల్సి ఉంది.

‘ఓ యునిక్‌ కాన్సెప్ట్‌తో రాహుల్‌ సంకృత్యాన్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో తన గత చిత్రాలకు భిన్నమైన సరికొత్త గెటప్స్‌లో నాని కనిపిస్తారు. కోల్‌కత్తా సన్నివేశాలు సినీ ప్రియులకి ఒక కొత్త అనుభూతిని పంచుతాయి’’ అని చిత్రటీమ్ చెప్తోంది.ఈ చిత్రానికి సంగీతం: మిక్కీ జే మేయర్, కెమెరా: సను జాన్‌ వర్గీస్, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: ఎస్‌. వెంకటరత్నం (వెంకట్‌).
Tags:    

Similar News