ఆ హుషారు ఎక్కడ రాజా?

Update: 2018-12-16 05:00 GMT
సినిమాకు ప్రమోషన్ ఎంత ముఖ్యమో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. బాహుబలి లాంటి వందల కోట్లతో తీసిన విజువల్ గ్రాండియర్ అయినా ఫిదా లాంటి సింపుల్ బడ్జెట్ లవ్ స్టొరీ అయినా జనంలోకి వెళ్ళాలి అంటే కంటెంట్ ఉన్నా సరే పబ్లిసిటీ చేసుకోవాల్సిందే. మౌత్ టాక్ ఎంత పాజిటివ్ గా ఉన్నా సినిమా హాల్ నిండాలి అంటే ప్రచారం అనే ఆయుధం వాడాల్సిందే. అయితే హుషారు టీం చేస్తున్న నిర్లక్ష్యం ఫైనల్ గా వసూళ్ళపై ప్రభావం చూపిస్తోంది. ఉద్యోగం చేయకుండా ఏదైనా స్వంతంగా వ్యాపారం చేసి తమ కాళ్ళ మీద నిలబడాలి అనే నలుగురు ఇంజనీరింగ్ కుర్రాళ్ళ లైఫ్ ని సరదాగా చూపించిన తీరు యువతను బాగా ఆకట్టుకుంటోంది.

అయితే హుషారు ప్రమోషన్ విషయంలో ఎలాంటి శ్రద్ధ వహించకపోవడంతో కలెక్షన్లు చాలా సెంటర్లలో ఆశించిన తీరు లో ఉండటం లేదు. కాలేజీ విద్యార్థుల ఫీడ్ బ్యాక్ వల్లే ఏ సెంటర్స్ లో హాళ్ళు నిండుతున్నాయి కాని బీసి కేంద్రాల్లో ఇది కొరవడటంతో హుషారు అనే సినిమా వచ్చిందన్న సంగతి సగటు ప్రేక్షకుడికి తెలియదు అంటే అతిశయోక్తి కాదు. ఇలాంటి జానర్ లో ఉండే ఫన్ మూవీస్ కి ఆదరణ బాగా ఉండే ఓవర్సీస్ లో సైతం హుషారు పరిస్థితి ఏమంత ఆశాజనకంగా లేదు.

సాధారణంగా సినిమా చూసి బయటికి వస్తున్న ప్రేక్షకులు బాగుంది బోర్ కొట్టలేదు అని చెప్పినప్పుడు ఖచ్చితంగా దాని ఎఫెక్ట్ టికెట్ కౌంటర్ల మీద ఉంటుంది. కనీసం ఆ మాటలను మిగిలిన జనం దాకా వెళ్ళేలా టీం చొరవ తీసుకోవాలి. అయితే సినిమాకు పెట్టిన బడ్జెట్ కు తగ్గట్ట్టే హుషారు యూనిట్ రాజీ ధోరణిలో ఉండటంతో రావాల్సిన రేంజ్ లో వసూళ్లు దక్కడం లేదు. వచ్చే శుక్రవారం భారీ సినిమాలు క్యు కట్టిన నేపధ్యంలో చేతిలో కొద్ది రోజులూ ఇలా నిర్లిప్తంగా ఉంటె పెట్టుబడి వెనక్కు రావొచ్చేమో కాని రేంజ్ మాత్రం రాదు.
   

Tags:    

Similar News