చిరు బాలయ్య.. లెట్స్ డు కుమ్ముడు

Update: 2016-12-29 15:11 GMT
కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు పుట్టడం సాధ్యమో కాదో చెప్పలేం కానీ.. ఇప్పుడు హైకోర్టు ఆదేశాలు చూస్తుంటే మాత్రం.. 'రిలీజ్ అయ్యే సమయానికి కలెక్షన్స్ పెంచుకునే అవకాశం' మాత్రం నిర్మాతలకు వచ్చేట్లుగా ఉంది. సంక్రాంతి పండుగకు మెగాస్టార్ చిరంజీవి మూవీ ఖైదీ నంబర్ 150.. బాలకృష్ణ సినిమా గౌతమిపుత్ర శాతకర్ణి రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే.

ఈ రెండు సినిమాల టార్గెట్.. కలెక్షన్స్ లో కొత్త రికార్డులు సృష్టించడమే. తాజాగా హైకోర్టు తీసుకున్న ఈ నిర్ణయం.. సినిమా టికెట్ ధరలను పెంచుకునేందుకు అనువుగా ఉందని నిర్మాతలు.. డిస్ట్రిబ్యూటర్లు తెగ సంతోషించేస్తున్నారు. ప్రేక్షకుల ప్రయోజనాలతో పాటు ఎగ్జిబిటర్లు.. బయ్యర్ల సమస్యలు కూడా దృష్టిలో పెట్టుకుని.. సినిమా టికెట్ల ధర నిర్ణయం విషయంలో కొత్త మార్గదర్శకాలను రూపొందించాలని.. రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

ఇందుకోసం కమిటీలు నిర్ణయించాలని చెప్పగా.. ప్రొడక్షన్ ఖర్చులకు అనుగుణంగా టికెట్ ధరలు నిర్ణయించుకునే వెసులు బాటు థియేటర్ల యజమానులకు ఉండాలనే పాయింట్.. సంక్రాంతి సినిమాలకు వరంగా మారనుందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. ఇప్పటి థియేటర్ల తీరు మారిందని.. మల్టీప్లెక్సుల స్థాయికి ఎదగడం లాంటి వాటితో పాటు ఖర్చులు కూడా పెరిగాయని.. ఇలాంటి పరిస్థితుల్లో పాత జీవోలు సరికాదన్నది హైకోర్టు అభిప్రాయం.

హోంశాఖ ముఖ్య కార్యదర్శుల అధ్యక్షతన కొత్త కమిటీలు ఉండాలని హైకోర్టు ఆదేశించడం.. భారీ బడ్జెట్ చిత్రాలకు.. ప్రధానంగా సంక్రాంతికి రానున్న ఖైదీ నంబర్ 150.. గౌతమిపుత్ర శాతకర్ణిలకు వరంగా మారుతుందనే అంచనాలు వినిపిస్తున్నాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News