నిజాయితీగా ఉండే ఓ ప్రభుత్వ అధికారి చుట్టూ ఓ కమర్షియల్ కథ అల్లి మెప్పించాడు సంతోష్ శ్రీనివాస్. హైపర్ సినిమాకు ప్రభుత్వాధికారిగా సత్యరాజ్ పోషించిన పాత్రే ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఈ సినిమా చూసి చాలామంది ప్రభుత్వ అధికారులు తనకు ఫోన్ చేసి అభినందించారని.. అన్నిటికంటే అదే సంతృప్తికరమైన విషయం అని కూడా చెప్పాడు దర్శకుడు సంతోష్ శ్రీనివాస్. ఈ నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వ ఉద్యోగుల కోసం ‘హైపర్’ స్పెషల్ షోలు ప్లాన్ చేస్తున్నారు ఈ చిత్ర నిర్మాతలు.
రెండు తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రధాన నగరాల్లో ప్రభుత్వ ఉద్యోగుల కోసమే ప్రత్యేకంగా షోలు ఏర్పాటు చేస్తున్నారట. వీరికి టికెట్ ధరలు కూడా తగ్గిస్తారని చెబుతున్నారు. ఇది సినిమా ప్రమోషన్ కు కూడా బాగా ఉపయోగపడుతుందనడంలో సందేహం లేదు. మంచి హైప్ మధ్య విడుదలైన ‘హైపర్’ తొలి రోజు రూ.3.8 కోట్ల వరకు షేర్ రాబట్టింది. రామ్ కెరీర్లో ఇదే ఫస్ట్ డే హైయెస్ట్ గ్రాస్. తర్వాతి రెండు రోజుల్లోనూ మంచి వసూళ్లే రావచ్చని అంచనా. సోమవారం నుంచి కలెక్షన్లు తగ్గే అవకాశముంది. ‘కందిరీగ’ తర్వాత సంతోష్ శ్రీనివాస్-రామ్ కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా ఇది. కంటెంట్ పరంగా రొటీన్ అయినప్పటికీ కమర్షియల్ అంశాలకు లోటు లేకపోవడంతో సినిమా బాగానే ఆడుతోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/