టీజర్ టాక్: తండ్రి సెంటిమెంట్ హైపర్

Update: 2016-09-04 04:00 GMT
'హైపర్' స్థాయిలో తండ్రి సెంటిమెంట్ ఉంటే ఏమవుతుంది? ఒక ప్రక్కన తల్లి క్రింద పడి అమ్మా అని అరిస్తే.. అందరూ అమ్మా అనే అరుస్తారు కాని.. నాన్న అని అరవరు ఏంటి అనే నైజంతో పెరిగిన కొడుకు.. చివరకు పెద్దయ్యాక ఏమవుతాడు? హీరో రామ్‌ ప్రధాన పాత్రలో సంతోష్‌ శ్రీనివాస్ డైరక్షన్లో రూపొందుతున్న ''హైపర్'' సినిమా థీమ్ ఇదే.

గత రాత్రి రిలీజైన హైపర్ టీజర్ చూస్తే ఈ విషయం మనకు అర్ధమైపోతుంది. అయితే ఈ సినిమాలో రామ్ మరోసారి తన హిట్టు సెంటిమెంట్ ను రిపీట్ చేశాడు. ఒక ప్రక్కన తండ్రి సెంటిమెంట్ తన గత సినిమా ''నేను శైలజ''లో కూడా కీలక పాయింటే. మరో ప్రక్కన ఆ సినిమాలో హీరోయిన్ తండ్రిగా చేసిన సత్యరాజ్ ఇప్పుడు హీరో తండ్రిగా చేస్తున్నాడు. ఆ విధంగా హైపర్ చుట్టూ చాలా సెంటిమెంట్లున్నాయి. ఇక టీజర్ వరకు బాగానే ఉందనే చెప్పాలి.

అయితే సెప్టెంబర్ 29 లేకపోతే అక్టోబర్ లో హైపర్ సినిమాను రిలీజ్ చేసే ఛాన్సుంది. రామ్ సరసన ఈ సినిమాలో రాశి ఖన్నా హీరోయిన్ గా నటిస్తోంది.
Full View

Tags:    

Similar News