నేనేం మాస్టర్ ను కాదు.. ఇప్పటికి విద్యార్థినే

Update: 2021-07-06 05:30 GMT
ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అనే సూత్రం పాటించిన వారే జీవితంలో పైకి వస్తారని పెద్దలు అంటూ ఉంటారు. యూనివర్శిల్ స్టార్‌ గా గుర్తింపు దక్కించుకున్న కమల్‌ హాసన్ ఇప్పటికి ఒక సింపుల్ నటుడిగానే తనకు తాను అనుకుంటూ ఉంటాడు. ఆయన సినీ కెరీర్‌ లో ఎన్నో అద్బుతాలను ఆవిష్కరించాడు. అలాంటి యూనివర్శిల్ స్టార్ ఇప్పటికి కూడా ప్రయోగాత్మక సినిమాలు చేస్తూనే ఉన్నాడు. దశావతారం విడుదల అయ్యి 13 ఏళ్లు పూర్తి అయిన సందర్బంగా ఆ సినిమా కు సంబంధించిన విషయాలను సోషల్‌ మీడియా ద్వారా కమల్‌ హాసన్‌ షేర్‌ చేసుకున్నాడు. ఆ సమయంలోనే దర్శకుడు అల్ఫోన్స్ పుత్రేన్‌ స్పందిస్తూ దయచేసి అద్బుత చిత్రం అయిన మైకేల్‌ మదన కామరాజు గురించిన విషయాలు తెలియజేయాలని.. అప్పటి మేకింగ్‌ విషయాలను చెప్పడం వల్ల ఇప్పటి యువ దర్శకులకు చాలా పాఠం నేర్చుకున్న వారు అవుతామని అన్నాడు.

దర్శకుడి విజ్ఞప్తి మేరకు మైకేల్ మదన కామరాజు సినిమాకు సంబంధించిన పలు ఇంట్రెస్టింగ్‌ విషయాలను మేకింగ్ ట్రిక్స్ ను ఇంకా పలు విషయాలను సోషల్‌ మీడియా ద్వారా ఆయన షేర్‌ చేసుకున్నాడు. ఆపై సినిమాల మేకింగ్ గురించి చెప్పడానికి నేనేం మాస్టర్‌ ను కాదు. ఒక వేళ నన్ను అలా పిలిచినా ఒప్పుకోను. మాస్టర్‌ అంటే చాలా త్యాగం అవసరం. అలాంటి వారికే ఆ గౌరవం దక్కుతుంది. మాస్టర్ గా నేను మారాను అని నేను ఎప్పటికి అనుకోను. నేను ఇప్పటికి ఎప్పటికి నేర్చుకుంటూనే విద్యార్థిగా ఉంటాను. నా గురువులు బాల చందర్ గారు.. సింగీతం గారు ఎన్నో విషయాలు నేర్పించారు. వారి నుండి నేర్చుకున్న పరిజ్ఞానంతో సినిమాలు చేస్తున్నాను. ప్రతి రోజు ఏదో ఒక కొత్త విషయం నేర్చుకోవాలని భావిస్తాను అన్నాడు.

అదే సమయంలో యువ దర్శకులను ఉద్దేశించి మేము ఎప్పుడో 30 ఏళ్ల క్రితం తీసిన చేసిన క్లాసిక్ సినిమాల గురించి ఆలోచించడం మానేసి కొత్తగా క్లాసిక్ సినిమాలను ఎలా తెరకెక్కించాలనే విషయాన్ని ఆలోచించండి అంటూ సూచించాడు. ప్రతి ఒక్క యువ దర్శకుడు కూడా కొత్త విషయాలను తెలుసుకునేందుకు కొత్తగా సినిమాను తెరకెక్కించేందుకు ప్రయత్నించాలంటూ కమల్‌ హాసన్ సూచించాడు. యువ దర్శకులు పాత సినిమాలను పట్టుకుని చర్చించుకోవడం మానేసి కొత్తగా క్లాసిక్‌ లను సృష్టించాల్సిన సమయం అంటూ కమల్‌ అభిప్రాయం వ్యక్తం చేశాడు. తన సుదీర్ఘ సినీ చరిత్రలో ఎన్నో అద్బుత విజయాలు.. ప్రయోగాలు.. గౌరవాలు దక్కించుకున్న కమల్ హాసన్‌ తాను ఇంకా ఒక విద్యార్థినే అంటూ చెప్పుకోవడం ఆయన అనుకువకు నిదర్శణం అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.
Tags:    

Similar News