వైష్ణవ్ తొలి సినిమా గా వచ్చిన 'ఉప్పెన' భారీ విజయాన్ని నమోదు చేసింది. విడుదలైన ప్రతి ప్రాంతంలోను వసూళ్ల వర్షం కురిపించింది. అలా ఫస్టు సినిమాతోనే స్టార్ డమ్ తీవెచ్చుకున్న అతి తక్కువ మంది హీరోల్లో ఆయన ఒకరిగా నిలిచాడు. ఆయన రెండవ సినిమాగా 'కొండ పొలం' నిర్మితమైంది. క్రిష్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఈ నెల 8వ తేదీన థియేటర్లకు రానుంది. కీరవాణి ఈ సినిమాకి స్వరాలను అందించగా, కర్నూల్లో నిన్న రాత్రి ఆడియో ఫంక్షన్ ను నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ వేదికపై వైష్ణవ్ తేజ్ మాట్లాడాడు.
"చాలా రోజుల తరువాత ఒక ఆడియో లాంచ్ చేస్తున్నాము .. నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది .. పాత రోజులు గుర్తుకు వచ్చాయి. ఈ రోజు ఇక్కడ హీరో .. కీరవాణిగారు. ఆయన ఈ సినిమాకి అద్భుతమైన మ్యూజిక్ ను ఇచ్చారు. రెండో సినిమాకే కీరవాణిగారు సంగీతాన్ని అందించడం నాకు చాలా ఆనందంగా ఉంది. అంత గొప్ప సంగీత దర్శకుడు నా సినిమా చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఒక వైపున 'ఆర్ ఆర్ ఆర్' .. మరో వైపున 'హరిహర వీరమల్లు' సినిమాలకి పనిచేస్తూ కూడా ఆయన 'కొండ పొలం' సినిమా కోసం సమయాన్ని కేటాయించారు.
సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి గారు ఈ సినిమాలోని రవీంద్ర పాత్రను ఎంతో గొప్పగా మలిచారు. ఆ పాత్రను అంతే గొప్పగా క్రిష్ గారు తెరకెక్కించారు. ఈ పాత్ర మనందరిలో ఒకరిది. జీవితంలో ఎన్ని కష్టాలు ఎదురైనా తల ఎత్తుకునే ఉండాలనే విషయాన్ని ఈ సినిమా చెబుతుంది. రై రై రయ్యారై అనేది రవీంద్ర ఒక మంత్రంలా తరచూ అంటూ ఉంటాడు. ఆ మంత్రం మీరు కూడా చెప్పి చూడండి" అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ఈ కార్యక్రమానికి రకుల్ హాజరు కాలేదు. కానీ తాను చెప్పదలచుకున్నది వీడియో ద్వారా పంపించింది.
'కొండ పొలం' ఫంక్షన్ కి హాజరు కాలేకపోయినందుకు నేను చాలా ఫీలవుతున్నాను. నేను 'లండన్' లో షూటింగులో ఉండటం వలన రాలేకపోయాను. ఈ సినిమాలో నేను 'ఓబులమ్మ' పాత్రను చేశాను. నా కెరియర్లో నాకు బాగా నచ్చిన పాత్ర ఇది. ఇప్పటికే ఈ విషయాన్ని నేను చాలా ఇంటర్వ్యూలలో చెప్పాను. ఇంత గొప్ప పాత్రను నేను చేస్తానని క్రిష్ గాను నమ్మినందుకు .. ఆ పాత్రను నాకు ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. కీరవాణిగారి సంగీతం హృదయాన్ని టచ్ చేస్తుంది .. ఆయన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వింటుంటే గూస్ బంప్స్ వస్తాయి. ఆయనకి నేను మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెబుతున్నాను" అని అంది.