బాలీవుడ్ లో క్రేజీ హీరో కం దర్శకనిర్మాతగా సుపరిచితుడు ఫర్హాన్ అక్తర్. ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నటించి నిర్మాతగానూ పాపులరయ్యారు. సాహో ఫేం శ్రద్ధా కపూర్ తో అతడి సహజీవనం గురించి అప్పట్లో ఆసక్తికర చర్చ సాగింది. ప్రస్తుతం అతడు గాయని కం నటి శిబానీ దండేకర్ తో ప్రేమాయణం సాగించడం తెలిసినదే. తాజాగా ఫర్హాన్ నటించిన తూఫాన్ హిందీ చిత్రం 16 జూన్ రిలీజ్ కి రెడీ అవుతోంది.
భాగ్ మిల్కా భాగ్ తరువాత తూఫాన్ లాంటి స్పోర్ట్స్ డ్రామాతో అతడు మెస్మరైజ్ చేసేందుకు సిద్ధమవ్వడంతో అభిమానుల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ సినిమా ఎలా మొదలైంది? అన్నదానికి ఆయన తాజా చాటింగ్ లో మాట్లాడుతూ.. `భాగ్ మిల్కా భాగ్` ఫేం రాకేశ్ జీతో నాకు అద్భుతమైన అనుబంధం ఉంది. అతను నన్ను పిలిచి మరో స్పోర్ట్స్ డ్రామా ఉందని చెప్పిన క్షణం చాలా సంతోషించాను. బాక్సర్ అజీజ్ అలీ పాత్రను విన్న క్షణం నేను వెంటనే సినిమాకు ఓకే చెప్పాను అని ఫర్హాన్ తెలిపారు.
తూఫాన్ లో అతడు అజ్జు భాయ్ గా కనిపించనున్నారు. ముంబైలోని మురికివాడ ప్రాంతమైన డోంగ్రిలోని అజ్జు భాయ్ అకా అజీజ్ అలీ అత్యంత ప్రసిద్ధ చెందిన తపోరి ఫైటర్. అందరూ అతనికి భయపడతారు.అతను ఒక విచిత్ర సంఘటనతో బాక్సింగ్ లోకి వస్తాడు. ఇది అతని జీవితాన్ని మారుస్తుంది. భౌతిక కోణం కంటే అజీజ్ అలీలోని ఎమోషనల్ యాంగిల్ సినిమా ఆద్యంతం వేడెక్కిస్తుందని ఫర్హాన్ తెలిపారు.
రాకేశ్ ఓం ప్రకాష్ మెహ్రా చిత్రాలలో బలమైన ఎమోషన్ ఉంటుంది. అతని పాత్రలన్నీ డెప్త్ ఉన్న కథను కలిగి ఉంటాయి. తూఫాన్ లో నా పాత్ర అలాంటిదే. రాకేశ్ జీ నా పాత్రను తీర్చిదిద్దిన విధానం నిరూపించుకునేందుకు ఎలివేట్ చేసుకునేందుకు గట్టి అవకాశాన్ని ఇచ్చింది.
ఇప్పుడు మేము రెండు చిత్రాలకు కలిసి పనిచేశాం. అతను నా బలాలను కథలుగా మారుస్తారని నాకు తెలుసు... ఇప్పటి వరకు నా పాత్రలన్నింటినీ సీరియస్ గా తీసుకున్నాను. శారీరక పరివర్తనకు నేను ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వను. ఎందుకంటే ఇది చాలా శిక్షణతో సాధించవచ్చు. కానీ ఒక పాత్ర మనస్సులోకి రావడం ఎల్లప్పుడూ కష్టం. తూఫాన్ తో కూడా నాకు అదే కొంత ఇబ్బంది అయ్యింది. కానీ దానిని సాధించేందుకు తపించాను.. అని తెలిపారు.
బాక్సర్ ఆకారంలోకి రావడం కఠినమైనది. ఈ పాత్రకు నన్ను నేను పూర్తిగా శారీరకంగా సిద్ధం చేయడానికి ఆరు నెలలు పట్టింది. నా పాత్ర మామూలు ముంబై స్థానిక కుర్రాడు కాబట్టి తపోరి లింగో సరైనది కావడం చాలా కష్టం. నేను జీవితంలో చాలా ఓపికను కలిగి ఉండటం నేర్చుకున్నాను. అలాగే నేను అజ్జు భాయ్ పాత్ర పోషించిన విధానం ప్రతి ఒక్కరూ లింగోను జీవితంలో అతని పోరాటాన్ని ప్రేమిస్తారు. కథ నాటకం మొత్తం చివరి వరకు సీట్ అంచుపై కూచోబెడుతుంది అని ఫర్హాన్ తెలిపారు.
నేను హిందీ చిత్రానికి దర్శకత్వం వహించాలనే ఆలోచనలో ఉన్నా కానీ మహమ్మారి కారణంగా వేచి చూడాల్సి వచ్చింది. ప్రస్తుతానికి ఈ విషయంపై కూడా పని చేస్తున్నాను.. అని తెలిపారు. తెలుగులో సినిమా చేస్తారా? అన్న ప్రశ్నకు.. ప్రస్తుతానికి తెలుగులో సినిమా చేయాలనే ఆలోచన నాకు లేదు. స్పష్టంగా చెప్పాలంటే నాకు ఇంతవరకు ఏ ఆఫర్ రాలేదు. నాకు మంచి పాత్ర వస్తే.. సిద్ధమే.
టాలీవుడ్ కొన్ని గొప్ప సినిమాలను ఆలస్యంగా తీస్తున్నా.. నేను కూడా తెలుగు చిత్రంలో నటించేందుకు సిద్ధంగా ఉన్నాను.. అని తెలిపారు. అతడు మాట్లాడిన దానిని బట్టి మునుముందు టాలీవుడ్ అగ్ర హీరోలతో కలిసి భారీ ఫ్రాంఛైజీ చిత్రాలకు పని చేసినా ఆశ్చర్యపోనవసరం లేదు.