సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయారంగేట్రం అనూహ్యంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. కొత్త సంవత్సర కానుకగా రాజకీయ పార్టీని ప్రకటించేందుకు సిద్ధమైన ఆయన సడెన్ గా నిర్ణయం మార్చుకోవాల్సి వచ్చింది. అంతకుముందు హైదరాబాద్ లో షూటింగ్ స్పాట్ లో అస్వస్థతకు గురవ్వడంతో రజనీ తన నిర్ణయం మార్చుకున్నారు. ఇది రజనీ అభిమానులు సహా చాలామంది సెలబ్రిటీల్ని నిరాశపరిచింది. రజనీ వీరాభిమాని అయిన రాఘవ లారెన్స్ అంతే నిరాశ చెందానని అన్నారు.
అయితే రజనీ ఎట్టిపరిస్థితుల్లో రాజకీయాల్లోకి రావాల్సిందేనంటూ అభిమానుల నుంచి ఒత్తిడి తీవ్రంగా ఉంది. తనపైనా ఒత్తిడి తెస్తున్నారని అందువల్ల వివరణ ఇవ్వాల్సి వస్తోంది అంటూ రాఘవ లారెన్స్ తాజాగా ట్విట్టర్ లో ఓ సుదీర్ఘ నోట్ ని రిలీజ్ చేశారు.
``తలైవర్ నిర్ణయం మార్చుకుని రాజకీయాల్లోకి రమ్మని చెప్పాల్సిందిగా నాపైనా కొందరు ఒత్తిడి చేస్తున్నారు. అందుకే ఈ ప్రకటన. రజినీ సర్ రాజకీయాల్లోకి రాకపోవడంపై మీలానే నేనూ బాధపడ్డాను. కానీ ఆయన వేరే ఏదైనా కారణం చెప్పి ఉంటే మనం ఆయన నిర్ణయాన్ని మార్చుకోమని అడగొచ్చు. కానీ తలైవర్ చెప్పిన కారణం అనారోగ్యం. ఇలాంటి సమయంలో ఒత్తిడి మేరకు ఆయన రాజకీయాల్లోకి వస్తే అప్పుడేదైనా జరగరానిది జరిగితే ఆ బాధను జీవితాంతం మర్చిపోలేం. ఆయన ఆరోగ్యం ఎంతవరకూ సహకరిస్తుందో నాకు బాగా తెలుసు. ఆయన ఆరోగ్యంగా ఉండాలని భగవంతుని సర్వదా ప్రార్థిద్దాం.. నా ప్రార్థనలు ఎప్పటికీ ఉంటాయి. గురువే శరణం`` అని లేఖలో రాశారు లారెన్స్.